APలో పెరిగిపోతున్న స్థూలకాయం! పొట్టబాబులు ఎక్కువ అయ్యారట!

స్థూలకాయం.. దేశంలో రోజు రోజుకి ఈ సమస్య బారిన బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఒబెసిటీ అంశం ప్రస్తావనకు వచ్చింది. అంతేకాకుండా.. ఈ స్థూలకాయం సమస్యలు అనేవి రోజు రోజుకి దేశంలో పెరుగుతున్నాయని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

స్థూలకాయం.. దేశంలో రోజు రోజుకి ఈ సమస్య బారిన బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఒబెసిటీ అంశం ప్రస్తావనకు వచ్చింది. అంతేకాకుండా.. ఈ స్థూలకాయం సమస్యలు అనేవి రోజు రోజుకి దేశంలో పెరుగుతున్నాయని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

స్థూలకాయం.. దేశంలో రోజు రోజుకి ఈ సమస్య బారిన బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఇక ఈ స్థూలకాయం సమస్య అనేది ప్రతిఒక్కరికి ఇప్పుడు శారీరక సమస్యలో ఒకటిగా మారిపోయింది. పైగా ఈ సమస్యకు వయసుతో సంబంధం ఉండదు. ఎందుకంటే.. ఈ స్థూలకాయం సమస్యతో బాధపడే వారిలో చిన్నారులు కూడా ఉండటం గమన్హారం. ఇకపోతే ఈ స్థూలకాయ సమస్య అనేది ఆహారపు అలవాట్లే ఉండే మార్పులకు కారణమని తెలిసిందే.  ఇదిలా ఉంటే.. తాజాగా దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై ఆర్థిక సర్వేలో ఆందోళన వ్యక్తమైంది. అంతేకాకుండా.. దేశంలో 54 శాతం అనారోగ్య సమస్యలకు ఆహారపు అలవాట్లే కారణమని ఈ సర్వే పేర్కొంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఒబెసిటీ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలోనే..  దేశంలో రాను రాను ఈ స్థూలకాయం సమస్యలు అనేవి పెరుగుతున్నాయని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, దేశంలో ఇప్పటికే 54 శాతం అనారోగ్య సమస్యలకు ఆహారపు అలవాట్లే కారణమని ఈ సర్వే పేర్కొంది. అందులో స్థూలకాయం సమస్య ప్రధానమైనదని వెల్లడించింది. ఇకపోతే  అధిక చక్కెర, కొవ్వులు ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరిగిన క్రమంలో ఈ స్థూలకాయం ఈ సమస్య అనేది పెరుగుతుండటానికి ముఖ్య కారణమని తాజా నివేదికల్లో తెలిసింది. అందుకోసం అలాంటి ఆహార పదార్థాల వినియోగంపై అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నొక్కి మరి చెప్పింది. అంతేకాకుండా..  ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అలాగే దేశంలో  ఫిజికల్‌ యాక్టివిటీ తగ్గిపోవడం అధిక బరువు వంటి కారణాలు ఈ ఒబెసిటీకి కారణమవుతోందని వివరించింది. పైగా పెద్దల్లో ఈ స్థూలకాయం మూడింతలు పెరిగిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇక చిన్నారుల విషయానికి వస్తే..  ఈ సమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. అయితే  ఈ విషయంలో వియత్నాం, నమీబియా తర్వాత స్థానంలో భారత్‌ ఉందంటూ వరల్డ్‌ ఒబెసిటీ ఫెడరేషన్‌ నివేదికను ఆర్థిక సర్వే ఉటంకించింది. ఇకపోతే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే ఎక్కువగా స్థూలకాయం సమస్య ఉంది. ఇలా చూసుకుంటే..  గ్రామాల్లో ఈ సమస్య 19.3 శాతం ఉంటే, పట్టణాల్లో 29.8 శాతంగా ఉండటం గమనార్హం.

ఇకపోతే ఈ అధిక బరువు సమస్య 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసులోపు పురుషుల్లో  18.9 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది. అలాగే మహిళ్లో 20.6 శాతం నుంచి 24 శాతానికి చేరింది. అలా చూసుకుంటే..  రాష్ట్రాల వారీగా ఢిల్లీలో మహిళలు 41.3 శాతం మంది అధిక బరువులో బాధపడుతున్నారు. ఇక పురుషుల్లో 38 శాతం మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆ తర్వాత తమిళనాడులో పురుషులు 37 శాతం మంది, మహిళలు 40.4 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఇక మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో పురుషుల్లో 31.1 శాతం, మహిళల్లో 36.3 శాతం మందిలో ఒబెసిటీ సమస్య ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. మరి,  ఎక్కవుగా ఒబెసిటీతో సమస్య బాధపడుతున్న దేశంలో భారత్ టాప్ 3లో ఉందని తాజా నివేదికల్లో తేలడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments