దోమలను వెతికి పట్టుకుని మరీ చంపే మిషన్‌ని పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra Introduced A Mosquito Destroyer: ఆనంద్ మహీంద్రా దోమలని చంపే సరికొత్త మిషన్ ని పరిచయం చేశారు. సాధారణంగా దోమల బ్యాట్లతో మనం దోమల్ని వెతికి చంపాల్సి ఉంటుంది. అయితే ఈ మిషన్ మాత్రం దోమల్ని వెతికి మరీ చంపుతుంది.

Anand Mahindra Introduced A Mosquito Destroyer: ఆనంద్ మహీంద్రా దోమలని చంపే సరికొత్త మిషన్ ని పరిచయం చేశారు. సాధారణంగా దోమల బ్యాట్లతో మనం దోమల్ని వెతికి చంపాల్సి ఉంటుంది. అయితే ఈ మిషన్ మాత్రం దోమల్ని వెతికి మరీ చంపుతుంది.

ఇంట్లో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. చెవిలో గుయ్ గుయ్ అంటూ సౌండ్ చేస్తుంటే చాలా మందికి చిరాకు వస్తుంది. ఇక అవి కుడితే డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి. ఈ దోమల విషయంలో చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దోమల్ని చంపడానికి కాయిల్స్, దోమల బ్యాట్లు వాడుతుంటారు. ఈ కాయిల్స్ వెలిగిస్తే దోమలు కాయిల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే చస్తాయి. ఇక దోమల బ్యాట్లు వాడితే మనం దోమల వెంట పడి షాక్ కొట్టించి చంపాలి. అయితే ఓ మనిషి.. దోమల వెంటపడి ఎవరు చంపుతారేహే అని ఒక మిషన్ ని తయారు చేశాడు. అది దోమ కనబడితే చాలు చంపేస్తుంది. కాయిల్స్ వెలిగించినా, దోమల బ్యాట్లు వాడినా గానీ దోమలు తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ఈ మిషన్ కంటపడిన ఒక్క దోమ కూడా తప్పించుకునే వీలు లేకుండా దీన్ని తయారు చేశాడు. ఈ మిషన్ కి సంబంధించిన వీడియోని దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

దేశంలో డెంగీ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దోమల నివారణ కోసం స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ముంబైలో అయితే డెంగీ కేసులు మరీ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్రా దోమల నివారణ కోసం పరిష్కారంగా ఓ వీడియోని పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆయన తాజాగా దోమలను చంపే మెషిన్ ని పరిచయం చేశారు. ‘ముంబైలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ క్యానన్ ని కొనేందుకు ప్రయత్నిస్తున్నా. దీన్ని చైనీస్ వ్యక్తి తయారుచేశాడు. ఇది దోమలను వెతికి పట్టుకుని మరీ చంపుతుంది. ఇది మీ ఇంటికి ఐరన్ డోమ్ లాంటిది’ అంటూ రాసుకొచ్చారు.

యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని పోలి ఉన్న ఈ మిషన్ లో ఒక రాడార్ సిస్టంని అమర్చాడు చైనీస్ వ్యక్తి. ఇది మిషన్ చుట్టూ ఉన్న దోమలను వేగంగా గుర్తించి లేజర్ పాయింటర్ ద్వారా చంపేస్తుంది. చైనాకి చెందిన ఒక వ్యక్తి తన ఎలక్ట్రిక్ కారులోని రాడార్ ని ఈ విధంగా మార్చి దోమలను చంపే మిషన్ ని తయారు చేశాడని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. ఆసక్తికరంగా అనిపించిన వాటిని, ప్రతిభకి సంబంధించిన విషయాలను నెటిజన్స్ తో పంచుకోవడం ఆనంద్ మహీంద్రాకు అలవాటు. ఎప్పటిలానే ఈసారి కూడా ఆయన ఇలా కొత్తగా దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన షేర్ చేశారు.

Show comments