iDreamPost
android-app
ios-app

Anand Mahindra:13 ఏళ్ల బాలికకు ఆనంద్ మహీంద్ర జాబ్ ఆఫర్! ఏంటి ఈమె స్పెషల్..!

మహీంద్ర గూప్ర్ అధినేత ఆనంద్ మహీంద్రా సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలపై స్పందిస్తుంటారు. అలానే ప్రతిభ కలిగిన వారిని గుర్తించి.. వారి గురించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. తన స్పందన తెలియజేస్తుంటారు. తాజాగా 13 ఏళ్ల బాలికకు ఆనంద్ మహీంద్ర జాబ్ ఆఫర్ ఇచ్చారు.

మహీంద్ర గూప్ర్ అధినేత ఆనంద్ మహీంద్రా సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలపై స్పందిస్తుంటారు. అలానే ప్రతిభ కలిగిన వారిని గుర్తించి.. వారి గురించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. తన స్పందన తెలియజేస్తుంటారు. తాజాగా 13 ఏళ్ల బాలికకు ఆనంద్ మహీంద్ర జాబ్ ఆఫర్ ఇచ్చారు.

Anand Mahindra:13 ఏళ్ల బాలికకు ఆనంద్ మహీంద్ర జాబ్ ఆఫర్! ఏంటి ఈమె స్పెషల్..!

మహీంద్రా గ్రూప్  ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లు. వ్యాపార రంగంలో ఆయన తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాందించారు. అలానే ఆయన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. సమాజాంలో జరిగే వివిధ ఘటనలపై ఆయన తరచూ స్పందిస్తుంటారు. అలానే వివిధ వినూత్న ఘటనలు పోస్టు చేసి..తనదైన శైలీలో స్పందిస్తుంటారు. అలానే ప్రతిభ కలిగిన వారి ప్రోత్సహించడంలో మహీంద్ర ముందుంటారు. తాజాగా ఆయన చేసిన పోస్టు అందరిని ఆకట్టుకుంది. ఇలాంటి ఆఫర్లు కూడా మహీంద్ర ఇస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఇటీవలే  ఉత్తర్ ప్రదేశ్ లో 13 ఏళ్ల బాలిక కోతుల నుంచి చిన్నారిని రక్షించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో కోతుల నుంచి తనను, ఆ చిన్నారిని రక్షించేందుకు ఆ 13 ఏళ్ల బాలిక టెక్నాలజినీ వాడుకుంది. అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా సాయంతో కోతుల బారి నుంచి వారిద్దరు ప్రాణాలను కాపాడింది. అలెక్సా తో కుక్కల శబ్దాలు చేయించి.. కోతులను భయపెట్టింది. ఆ శబ్దాలకు కోతులు అక్కడి నుంచి పారిపోయాయి. దీంతో ఆ బాలిక చూపించిన సమయస్ఫూర్తికి, సాంకేతికతను వినియోగించిన విధానాన్నికి అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆనంద్ మహీంద్ర ఏకంగా ఆమెకు ఉద్యోగం ఇస్తానని మాటిచ్చారు.

Anand Mahindra

సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. టెక్నాలజీకి మనం బానిసలు అవుతామా, లేక మాస్టర్లుగానే ఉంటామా అనేది నేటి ఆధునిక యుగంలో మన ముందున్న పెద్ద ప్రశ్న అని ఆయన అన్నారు. కానీ ఈ బాలిక సమయస్ఫూర్తిని చూశాక టెక్నాలజీ ఎప్పటికీ మనిషి ఆజ్ఞలను పాటించేదే అన్న ఆశాభావాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ బాలిక వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోందని మహీంద్ర తెలిపారు. ఆ  అమ్మాయి చదువును పుర్తి చేసిన తరువాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే తాము మహీంద్రా రైజ్‌లో చేరమని ఆహ్వానిస్తున్నామని ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో పేర్కొన్నారు.

మహీంద్రా పోస్టు వైరలవ్వడంతో నెటిజన్లు ఆ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. మనం తప్పనిసరిగా సాంకేతితకు మాస్టర్లుగానే ఉంటామన్నారు. అలానే అంత ప్రమాద సమయంలో ఆ బాలికు వచ్చిన ఐడియా సూపర్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నేటి తరం పిల్లల తెలివితేటలు మన ఊహకు కూడా అందట్లేదంటూ ఇంకొందరు స్పందించారు. మరి..చిన్నారికి కాపాడిన అమ్మాయికి ఆనంద్ మహీంద్ర ఉద్యోగం ఆఫర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.