iDreamPost
android-app
ios-app

గొప్ప మనసు చాటుకున్న హుచ్చమ్మ.. ఆమె చేసిన పనేంటో తెలిస్తే మీరు సెల్యూట్ కొడతారు!

గొప్ప మనసు చాటుకున్న హుచ్చమ్మ.. ఈమె చేసిన పనిని మెచ్చుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసి సత్కరించింది. ఇంతకు ఈ వృద్దురాలు ఏం చేసిందో తెలుసా?

గొప్ప మనసు చాటుకున్న హుచ్చమ్మ.. ఈమె చేసిన పనిని మెచ్చుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసి సత్కరించింది. ఇంతకు ఈ వృద్దురాలు ఏం చేసిందో తెలుసా?

గొప్ప మనసు చాటుకున్న హుచ్చమ్మ.. ఆమె చేసిన పనేంటో తెలిస్తే మీరు సెల్యూట్ కొడతారు!

చదువు విలువ తెలిసిన చాలా మంది ఏదో ఒక రూపంలో నేటి తరం పిల్లలకు తమకు తోచిన సాయం చేసేందుకు ముందుకు వస్తుంటారు. కొందరు వ్యక్తులు విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తుంటే.., మరి కొందరు చదువుకోలేని పిల్లలను ఉచితంగా చదివించేందుకు ముందుకొస్తుంటారు. కానీ, ఓ మహిళ మాత్రం.. దూరదృష్టితో ఆలోచించి ఎవరూ ఊహించని సాయం చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఓ వృద్దురాలు ఏకంగా తనకున్న రెండెకరాల పొలాన్ని పిల్లలు చదువుకునే పాఠశాలకు దానం చేసింది. ఆమె చేసిన సాయాన్ని తెలుసుకుని అందరూ సెల్యూట్ చేస్తున్నారు. ఇంతే కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం గుర్తించి ఆమెను ప్రతిష్మాత్మక అవార్డుకు ఎంపిక చేసి సత్కరించింది. ఇంతకు ఈ మహిళ ఎవరు? తనకున్నఆస్తిని ఎందుకు పాఠశాలకు దానం చేయాలని అనుకుందనే పూర్తి వివరాలు మీకోసం.

ఈమె పేరు హుచ్చమ్మ చైదరి. కర్ణాటక రాష్ట్రం కోప్పల్ పరిధిలోని తన్నూరు ప్రాంతానికి చెందిన ఈ వృద్ధురాలు స్థానిక పాఠశాలలో చాలా కాలంగా వంట మనిషిగా పని చేస్తున్నారు. అయితే పాఠశాలలో పిల్లలతో పాటు కలిసి ఉంటూ ఆమె చాలా నేర్చుకుంది. అయితే ఇన్నేళ్ల తన ప్రయాణంలో హుచ్చమ్మ మొత్తానికి చదువు విలువ తెలుసుకున్నారు. నేను ఎలాగో చదువు కోలేదు.., రేపటి పిల్లలు చదువుకునేందుకు ఏదో రకంగా తోచిన సాయం చేయాలని అనుకునేది. ఇక ఇందులో భాగంగానే హుచ్చమ్మ తన గొప్ప మనసును చాటుకుని పాఠశాల కోసం ఏకంగా తనకున్న రెండెకరాల భూమిని దానం చేసింది. ఈమె చేసిన పనిని తెలుసుకుని గ్రామస్తులు అంతా హుచ్చమ్మను మెచ్చుకుని ఆమె మంచి మనసును అందరికీ తెలియజేశారు. అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆమె చేసిన సేవను గుర్తించి దరఖాస్తు చేసుకోకున్న ఆమెను రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేసి ఇటీవల ఘనంగా సత్కరిచింది. అయితే ఈ అవార్డు గ్రహితకు రూ.5 లక్షల నగదు బహుమతితో పాటు 25 గ్రాముల బంగారాన్ని ప్రభుత్వం అందించడం విశేషం. పాఠశాలకు తనకున్న రెండెకరాల భూమిని దానం చేసిన హుచ్చమ్మ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.