iDreamPost
android-app
ios-app

ఖమ్మం సభలో రాష్ట్ర ప్రభుత్వంపై అమిత్‌ షా ఫైర్‌! అధికారం తమదే అంటూ..

  • Published Aug 27, 2023 | 6:15 PM Updated Updated Aug 27, 2023 | 6:15 PM
  • Published Aug 27, 2023 | 6:15 PMUpdated Aug 27, 2023 | 6:15 PM
ఖమ్మం సభలో రాష్ట్ర ప్రభుత్వంపై అమిత్‌ షా ఫైర్‌! అధికారం తమదే అంటూ..

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. కేంద్ర హొం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిషా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన ‘రైలు గోస-బీజేపీ భరోసా’  బహిరంగ సభలో పాల్గొని.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక కేసీఆర్‌ గద్డె దిగడం ఖాయమని.. తామే అధికారంలోకి వస్తామని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..స్తంబాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ఆశీస్సులతో ఖమ్మం వచ్చినట్లు, తెలంగాణ విమోచనానికి పోరాడిన జమలాపురం కేశవరావుకి ప్రణామాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలి కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ భద్రాచలం వెళ్తారు కానీ, రామాయలంలోకి వెళ్లరని, ఓవైసీ చేతిలో ఆయన కారు స్టీరింగ్‌ ఉందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయాలానికి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. బీజేపీలో ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకులను కేసీఆర్‌ ఇబ్బంది పెడుతున్నారని అమిత్‌ షా ఆరోపించారు. ఈటెల రాజేందర్‌, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ కేసీఆర్ ప్రభుత్వ లోపాలను ఎండగడుతుంటే వారిని అరెస్టులు చేస్తూ.. వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలపై కూడా అమిత్‌ షా విమర్శలు చేశారు. అవి మూడు కుటుంబ పార్టీలంటూ ఎద్దేవా చేశారు. రైతుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి అండగా ఉందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు చేయలేక కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బందులు పెడితే.. కేంద్రమే ప్రతి గింజను కొంటుందని అన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసింది ఏంటో చెప్పాలని సవాల్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించి.. బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు. మరి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తెలుగు భాషపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!