iDreamPost

తెలుగు భాషపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!

  • Author singhj Published - 04:20 PM, Sun - 27 August 23
  • Author singhj Published - 04:20 PM, Sun - 27 August 23
తెలుగు భాషపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!

భారతీయ భాషల్లో తెలుగుకు ఉన్న ప్రాముఖ్యత కాస్త స్పెషల్ అనే చెప్పాలి. తేనెలొలుకు భాషగా మన తెలుగుకు గొప్ప పేరుంది. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఊరికే అనలేదు. మన దేశంలోని భాషల్లోకెల్లా శ్రేష్ఠమైనదిగా తెలుగు ప్రాచుర్యం పొందింది. ఈ నెల 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం కావడంతో సెలబ్రేట్ చేసుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ‘మన్​ కీ బాత్​’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘మన్​ కీ బాత్​’ కార్యక్రమంలో తెలుగు భాష గురించి ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాతృభాషతో అందరూ అనుసంధానం అవ్వాలని ఆయన అన్నారు. దీని వల్ల మన సంస్కృతి, విలువలు, సంప్రదాయాలతో మంచి అనుబంధం ఏర్పడుతుందని చెప్పారు. మన దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటని మోడీ పేర్కొన్నారు. తెలుగు భాషా సాహిత్యం, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అనేక అద్భుతాలు ఇమిడి ఉన్నాయని మోడీ వ్యాఖ్యానించారు.

సంస్కృతంలాగే తెలుగు భాష కూడా అతి పురాతనమైందన్నారు ప్రధాని మోడీ. ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు. తెలుగు వారసత్వాన్ని మొత్తం దేశానికి అందించేందుకు తాము ప్రయత్నిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా చెప్పుకొచ్చారు. ఇక, క్రీడల్లో భారత్ సాధిస్తున్న విజయాల పైనా మోడీ కామెంట్స్ చేశారు. స్పోర్ట్స్​లో ఇండియా నిలకడగా రాణిస్తోందని, విజయాలు సాధిస్తోందన్నారు. చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో భారత ప్లేయర్లు రికార్డు స్థాయిలో పతకాలు సాధించారని మోడీ వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి