iDreamPost
android-app
ios-app

అమెరికా నుంచి ఇండియా వచ్చిన మహిళ.. పబ్జీలో పరిచయమైన ఇద్దరు కుర్రాళ్ల కోసం..

పబ్జీలో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారి.. ఇండియాలోని ఉత్తరప్రదేశ్ యువకుడు సచిన్ మీనా కోసం పాకిస్తాన్ నుండి వచ్చేసింది సీమా హైదర్ అనే మహిళ. ఇప్పుడు మరో మహిళ కూడా ఇండియాలోకి అడుగుపెట్టింది.

పబ్జీలో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారి.. ఇండియాలోని ఉత్తరప్రదేశ్ యువకుడు సచిన్ మీనా కోసం పాకిస్తాన్ నుండి వచ్చేసింది సీమా హైదర్ అనే మహిళ. ఇప్పుడు మరో మహిళ కూడా ఇండియాలోకి అడుగుపెట్టింది.

అమెరికా నుంచి ఇండియా వచ్చిన మహిళ.. పబ్జీలో పరిచయమైన ఇద్దరు కుర్రాళ్ల కోసం..

ఆన్ లైన్ గేమ్ ద్వారా ఏర్పడిన పరిచయాలు, ప్రేమలు కొంత మందిని.. ప్రాంతాలు, దేశాలు దాటిపోయేలా చేస్తున్నాయి. పబ్జీలో ఏర్పడిన పరిచయంతో పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ అనే మహిళ.. ఉత్తరప్రదేశ్ యువకుడు సచిన్ కోసం ఇండియాకు వచ్చేసింది. భర్తను వదిలేని.. తన నలుగురు పిల్లలతో ఇక్కడకు అక్రమంగా వచ్చి.. ప్రియుడ్ని పెళ్లి చేసుకుని, సెటిల్ అయిన సంగతి విదితమే. ఇప్పుడు మరో మహిళ కూడా పబ్జీలో ఏర్పడిన పరిచయం కోసం అమెరికాను వీడి భారత్‌కు వచ్చేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ఒక్కరి కోసం రాలేదు.. ఇద్దరు యువకుల కోసం ఇండియాలో అడుగుపెట్టింది. ఓ వ్యక్తితో కొన్ని రోజులు ఉండి.. మరో యువకుడి వద్దకు వెళ్లింది.

ఈ ఇద్దరు కలిసి బస్సులో తిరుగుతుంటే.. అనుమానం వచ్చిన బస్సు డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని హోమ్స్‌ క్రీక్‌ రోడ్ గ్రేస్‌విల్లేలో నివసించే 30 ఏళ్ల మహిళ బ్రూక్లిన్ కార్న్‌లీకి పబ్జీ ద్వారా చండీగఢ్‌ వాసి అయిన యువీ వాంగో, ఉత్తర్‌ప్రదేశ్‌ ఫరీదాబాద్‌లోని ఇటావాకు చెందిన హిమాన్షు యాదవ్ అనే ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పడింది. వీరి కోసం ఆమె ఇండియాకు వచ్చేసింది. 3 నెలల పాటు యువీ వాంగోతో కలిసి చండీగఢ్‌లో ఉంది అమెరికా యువతి. తర్వాత ఇటావాలోని హిమాన్షు వద్దకు వచ్చేసింది. అయితే ఈ ఇద్దరు కలిసి బస్సులో ప్రయాణీస్తుండగా..  ప్రయాణీకులకు అనుమానం రాగా,  డ్రైవర్‌కు సమాచారం అందించారు. వెంటనే అతడు రీజనల్ మేనేజర్‌కు చెప్పాడు.

ఆర్ఎం సూచనలు మేరకు బస్సు డ్రైవర్ వారిని నేరుగా పోలీస్ స్టేషన్ ‌కు తరలించాడు. అక్కడ పోలీసులు విచారణ చేపట్టారు. అప్పుడు అర్థమైంది.. ఇది పబ్జీ స్నేహమని. పబ్జీ ద్వారా ఈ ఇద్దరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ఫోన్ నంబర్లు తీసుకుని మాట్లాడుకోవడం, చాట్ చేసుకోవడం ప్రారంభించారు. వీరిని కలిసేందుకు అమెరికా నుండి టూరిస్టు వీసాపై 3 నెలల క్రితం ఇండియాకు వచ్చింది. తొలుత డీగఢ్‌లోని యువీ వాంగో ఫ్లాట్‌లో వారిద్దరూ కలిసి నివసించారు. ఆ తర్వాత హిమాన్షు వద్దకు వచ్చింది. అతడు పనిచేసే ప్రాంతానికి వెళ్లి.. అక్కడి నుండి ఇటావా వచ్చింది ఈ జంట. తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు బస్సు ఎక్కగా.. అనుమానం వచ్చి పోలీసు స్టేషన్ కు తరలించారు. కాగా, ఆ యువతికి హిందీ రాదని.. యువకుడికి ఇంగ్లీష్ రాదని పోలీసులు తెలిపారు. వారిద్దరూ గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రూక్లీన్‌ను ఢిల్లీ మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.