Venkateswarlu
Venkateswarlu
టెక్నాలజీ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కాదు.. సృష్టికి ప్రతి సృష్టి చేయటం అన్నది టెక్నాలజీకి మ్యాటర్ ఆఫ్ సెకన్స్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషులు నోరెళ్లబెట్టాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. ఒకరకంగా ఏఐ కొన్ని కోట్ల మంది కడుపు కొట్టబోతోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ముఖ్యంగా మీడియా ఫీల్డులో ఏఐ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. ఇందుకు తాజా పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణలు.
ఒరిస్సాలోని ఓ ఛానల్ ఏఐతో క్రియేట్ చేసిన యాంకర్‌ను వార్తలు చదవటానికి ఉపయోగిస్తోంది. అందమైన అమ్మాయికి ఏ మాత్రం తీసిపోకుండా ఉన్న ఆ ఏఐ బొమ్మ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అచ్చం మనిషిలా ఆ బొమ్మ వార్తలు చదువుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఓ వీడియోలో ఏఐ యాంకర్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నా నమస్కారాలు.. నేను ఓటీవీ.. ఓడిశాలో మొదటి ఏఐ టెక్నాలజీ యాంకర్‌ను.. నా పేరు లీసా’’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంది.
తర్వాత ఓటీవీ గురించిన సమాచారాన్ని ప్రేక్షకులకు అందజేసింది. ఇక, ఈ వీడియోలు, ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ భవిష్యత్తులో మనిషితో పని లేకుండా పోతుంది. మొత్తం టెక్నాలజీనే చూసుకుంటుంది’’.. ‘‘ మీడియాలో కొత్త విప్లవం మొదలైంది. ఇక, జర్నలిస్టులకు గడ్డుకాలం తప్పదు’’.. ‘‘రేపటి రోజు పని మొత్తం రోబోలు, ఏఐలు చేస్తాయి. మనిషి పని దొరక్క ఆకలి చావు చావాల్సి వస్తుంది’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, చీర కట్టుతో అందరినీ ఆకట్టుకుంటున్న ఏఐ యాంకరమ్మ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
భవిష్యత్తు లో న్యూస్ ఛానల్ యాంకర్ గా “కృత్రిమ మహిళా”
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో దేశంలోనే మొదటిసారి ఒడిశాలో OTV న్యూస్ ఛానల్ ఈ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ మహిళతో వార్తలు చదివించే విధానాన్ని ప్రారంభించింది. pic.twitter.com/7nmXc3be7p— HEMA (@Hema_Journo) July 10, 2023