iDreamPost

విద్యార్థులకు గుడ్ న్యూస్… ఇకపై ఏటా రెండు సార్లు అడ్మిషన్లు!

Universities Admissions: విద్యాసంస్థలో అడ్మిషన్లు అనేవి  ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు అనేవి ఒక్కసారి మాత్రమే జరుగుతుంటాయి. అయితే తాజాగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతూ ఓ నిర్ణయం వెలువడింది.

Universities Admissions: విద్యాసంస్థలో అడ్మిషన్లు అనేవి  ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు అనేవి ఒక్కసారి మాత్రమే జరుగుతుంటాయి. అయితే తాజాగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతూ ఓ నిర్ణయం వెలువడింది.

విద్యార్థులకు గుడ్ న్యూస్… ఇకపై ఏటా రెండు సార్లు అడ్మిషన్లు!

సాధారణంగా విద్యాసంస్థలో అడ్మిషన్లు అనేవి  ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు అన్ని చోట్ల అడ్మిషన్లు అనేవి ఒక్కసారి మాత్రమే జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు వివిధ కారణాలతో అడ్మిషన్లు కోల్పోతుంటారు. అది ఇలా ఉంటే.. స్టూడెంట్స్ కి వెసులుబాటు కల్పిస్తూ.. ఓ వార్త బయటకు వచ్చింది. ఇక నుంచి విశ్వవిద్యాలయాలు, హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్లు ఏటా రెండు సార్లు అడ్మిషన్లు తీసుకోనుందుకు  అనుమతి లభించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

దేశంలోని యూనివర్సిటీలు, హైయ్యర్ ఎడ్యూకేషన్  విద్యాసంస్థలో ఇకపై ఏటా రెండు సార్లు అడ్మిషన్లు  తీసుకోవచ్చు. అందుకు విద్యసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఇక 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ అకడమిక్ ఇయర్ నుంచి రెండు అడ్మిషన్లు తొలుత జులై–-ఆగస్టు,  మరోవిడత జనవరి–ఫిబ్రవరి ఉంటాయన్నారు.

ఈ సందర్భంగా ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ఇండియన్ వర్సిటీలు ఏటా రెండుసార్లు అడ్మిషన్లు ఇవ్వగలిగితే, బోర్డుల రిజల్ట్స్ఆలస్యం అవడం, హెల్త్​, వ్యక్తిగత సమస్యల​ వల్ల జులై–-ఆగస్టు సెషన్‌‌‌‌లో అడ్మిషన్‌‌‌‌ను తీసుకోలేని విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. యూనివర్సిటీల్లో ఏటా రెండు సార్లు అడ్మిషన్లతో విద్యార్థులకు ఒక సారి సీటు రాకపోతే ఏడాదంతా ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు. ప్రస్తుత అడ్మిషన్ విధానం చూసినట్లు అయితే ఒకసారి అడ్మిషన్ రాకుంటే ఏడాదంతా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. తాజాగా నిర్ణయంతో విద్యార్థులకు జాబ్ అవకాశాలు కూడా త్వరగా అందుకోవచ్చిని ఆయన తెలిపారు.

ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ల విధానంతో విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ల్యాబ్‌‌‌‌లు, తరగతులు వంటి ఇంతర సపోర్టింగ్ సర్వీసుల వంటి రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరింత సమర్థవంతంగా చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు ఇప్పటికే ఏటా రెండు అడ్మిషన్ల విధానాన్ని అనుసరిస్తున్నాయని జగదీశ్ తెలిపారు. ఇండియాలో కూడా ఇదే విధానం అనుసరిస్తే పలు ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే.. రెండు సార్లు అడ్మిషన్ల విధానం అనుసరించడం యూనివర్సిటీలకు తప్పనిసరి కాదని జగదీశ్ తెలిపారు. మరి.. ఏటా రెండు సార్లు అడ్మిషన్ల విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి