iDreamPost
android-app
ios-app

Aadhaar: ఆధార్‌ అలర్ట్‌.. ఇలా చేస్తే రూ.లక్ష జరిమానా, జైలు శిక్ష కూడా

  • Published May 18, 2024 | 3:33 PM Updated Updated May 18, 2024 | 3:33 PM

భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు అనేది కచ్చితం. దీనికి సంబంధించి కీలక అలర్ట్‌ వచ్చింది. ఆ వివరాలు..

భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు అనేది కచ్చితం. దీనికి సంబంధించి కీలక అలర్ట్‌ వచ్చింది. ఆ వివరాలు..

  • Published May 18, 2024 | 3:33 PMUpdated May 18, 2024 | 3:33 PM
Aadhaar: ఆధార్‌ అలర్ట్‌.. ఇలా చేస్తే రూ.లక్ష జరిమానా, జైలు శిక్ష కూడా

భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు ఉంటుంది. ప్రతి భారతీయుడికి ఆధార్‌ కచ్చితంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు ఉండటం ఎంతో ముఖ్యమో.. దానికి సంబంధించిన నియమ నిబంధనలను తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలో ఆధార్‌ చట్టం-2016 ప్రకారం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ప్రకారం ఆధార్‌ సంబంధిత నేరాలు, వాటికి విధించే శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని ప్రకారం ఆధార్‌కు సంబంధించి కొన్ని నేరాలకు పాల్పడితే.. లక్ష రూపాయల వరకు జరిమానా.. జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఆ నేరాలు ఏంటివో తెలుసుకొన జాగ్రత్తగా ఉండండి.

ఆధార్‌ కార్డు తీసుకునే సమయంలో.. కావాలని ఉద్దేశపూర్వంగా తప్పుడు జనాభా (డమోగ్రాఫిక్), బయోమెట్రిక్ సమాచారం ఇస్తే.. అలాంటి వారికి రూ. 10 వేల జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది అంటున్నారు.

ఎవరిదైనా ఆధార్‌ గుర్తింపు సమాచారాన్ని సేకరించేందుకు అధికారం కలిగిన ఏజెన్సీగా నటించడం కూడా నేరమే. దీనికి మూడేళ్ల వరకు జైలు లేదా రూ. 10 వేల వరకు ఫైన్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ ఇలాంటి నేరాలకు ప్పాడితే.. మాత్రం రూ. లక్ష వరకు జరిమానా చెల్లించాల్సిందే. కొన్ని సందర్భాల్లో అలాంటి కంపెనీలకు జైలు, జరిమానా రెండూ విధించే అవకాశం ఉంది.

ఆధార్‌ ధ్రువీకరణ లేదా నమోదు సమయంలో సేకరించిన సమాచారాన్ని.. ఎవరైనా అనధికార వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయడం, వెల్లడించడం, దానికి సంబంధించి ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడం, ఆధార్‌ నియమాలను ఉల్లంఘించడం నేరమే అవుతుంది. దీనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ వ్యక్తులు ఇలాంటి నేరాలకు పాల్పడితే.. ఒక వ్యక్తికి అయితే రూ. 10 వేల వరకు.. కంపెనీకి అయితే రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు.

సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (సీఐడీఆర్‌)ను అనధికారికంగా యాక్సెస్, హ్యాకింగ్ వంటివి చేయడం నేరం. దీనికి పదేళ్ల వరకు జైలు, కనీసం రూ. 10 లక్షలు ఫైన్ ఉంటుంది.

అలానే సీఐడీఆర్‌లోని డేటా ట్యాంపరింగ్ చేయడం కూడా నేరం. దీనికి పదేళ్లు జైలు, రూ. 10 వేలు జరిమానా ఉండొచ్చు.

పైన చెప్పిన నేరాల్లో.. దేనికైనా ఒక చోట నిర్దిష్ట మొత్తంలో జరిమానా విధించకపోతే.. అప్పుడు ఒక వ్యక్తికి.. మూడేళ్ల వరకు జైలు లేదా రూ. 25 వేలు జరిమానా పడుతుంది. ఇదే కంపెనీ విషయంలో రూ. లక్ష వరకు ఫైన్ ఉంటుంది.