iDreamPost
android-app
ios-app

Aadhaar Card: పిల్లల ఆధార్​కు కొత్త రూల్స్.. కార్డు కావాలంటే ఇవి తప్పనిసరి!

  • Published Jul 22, 2024 | 6:02 PM Updated Updated Jul 22, 2024 | 6:02 PM

మన దేశంలో ఇప్పుడు అత్యధికంగా ఉపయోగించే డాక్యుమెంట్​గా ఆధార్​ను చెప్పొచ్చు. పెద్దలే కాదు.. పిల్లలకు కూడా ఈ కార్డు కంపల్సరీగా మారింది. అయితే పిల్లల ఆధార్​కు కొత్త రూల్స్ వచ్చాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మన దేశంలో ఇప్పుడు అత్యధికంగా ఉపయోగించే డాక్యుమెంట్​గా ఆధార్​ను చెప్పొచ్చు. పెద్దలే కాదు.. పిల్లలకు కూడా ఈ కార్డు కంపల్సరీగా మారింది. అయితే పిల్లల ఆధార్​కు కొత్త రూల్స్ వచ్చాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Published Jul 22, 2024 | 6:02 PMUpdated Jul 22, 2024 | 6:02 PM
Aadhaar Card: పిల్లల ఆధార్​కు కొత్త రూల్స్.. కార్డు కావాలంటే ఇవి తప్పనిసరి!

మన దేశంలో ఇప్పుడు అత్యధికంగా ఉపయోగించే డాక్యుమెంట్​గా ఆధార్ కార్డు​ను చెప్పొచ్చు. పెద్దలే కాదు.. పిల్లలకు కూడా ఇప్పుడు ఇది కంపల్సరీగా మారింది. రోజువారీ జీవితంలో నిత్యం ఉపయోగించే డాక్యుమెంట్స్​లో ఇది ఒకటి. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, కొత్త సిమ్ కార్డు కొనాలన్నా, లోన్ పొందాలన్నా ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. అలాంటి ఈ కార్డుకు సంబంధించి కొన్ని కీలక నియమాలు, సూచనలు తెలుసుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్లకు కూడా ఆధార్ కార్డు తీయించడం తప్పనిసరి అని గ్రహించాలి. ఈ రోజుల్లో స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీల వరకు ఎక్కడ చేర్పించాలన్నా ఆధార్​ కార్డు కంపల్సరీగా కావాల్సిందే.

విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసమనే కాదు.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నా, బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అందుకే పిల్లలకు త్వరగా ఈ కార్డు పొందేలా చూడాలి. దీన్ని బ్లూ ఆధార్ లేదా బాల ఆధార్ అని పిలుస్తారు. అయితే ఈ కార్డు దరఖాస్తు విషయంలో కొన్ని కొత్త రూల్స్ విధించారు. ఈ నేపథ్యంలో చిల్డ్రన్ ఆధార్ కార్డ్ పొందే పద్ధతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పిల్లల ఆధార్ కోసం వాళ్ల డేటాఫ్ బర్త్ సర్టిఫికేట్, హాస్పిటల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ లేదా స్కూల్ ఐడీ కార్డ్ లేదా పేరెంట్స్ ఆధార్ కార్డ్​ తీసుకెళ్లాలి. పేరెంట్స్ ఓటర్ ఐడీ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్​ కూడా అవసరం పడుతుంది.

ఆధార్ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లాలి. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సైట్​లో ఆధార్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. బుక్ అపాయింట్​మెంట్ మీద క్లిక్ చేసి చిల్డ్రన్స్ ఆధార్​ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్, సెక్యూరిటీ కోడ్​ (క్యాప్చా)ను ఎంటర్ చేయాలి. అనంతరం వచ్చే లింక్ ఓపెన్ చేసి.. పిల్లల వివరాలు, పుట్టిన తేదీ, అడ్రస్ సహా మిగిలిన సమాచారాన్ని జాగ్రత్తగా నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొని అపాయింట్​మెంట్ బుక్ చేయాలి. ఆయా డాక్యుమెంట్లను తీసుకొని సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి కొన్ని ఫారమ్​లను నింపాలి. 5 సంవత్సరాల లోపు పిల్లలు అయితే వాళ్ల ఫొటోలు తీయడమే గాక పేరెంట్స్​లో ఒకరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. అదే 5 నుంచి 15 ఏళ్ల వయసు లోపు వారికైతే ఫొటో, వేలిముద్రతో పాటు బయోమెట్రిక్ డేటా కూడా తీసుకుంటారు.