iDreamPost
android-app
ios-app

మీ ఆధార్ కార్డుని ఎవ్వరూ దుర్వినియోగం చెయ్యకుండా ఉండాలంటే ఇలా లాక్ చేసుకోండి

  • Published Jun 21, 2024 | 1:51 PM Updated Updated Jun 21, 2024 | 1:51 PM

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డును ఎవ్వరూ దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే.. అందుకు ఒక మార్గం ఉంది. ఇంతకు ఏంటది.. ఎలా ఉపయోగించుకోవాలి అంటే..

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డును ఎవ్వరూ దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే.. అందుకు ఒక మార్గం ఉంది. ఇంతకు ఏంటది.. ఎలా ఉపయోగించుకోవాలి అంటే..

  • Published Jun 21, 2024 | 1:51 PMUpdated Jun 21, 2024 | 1:51 PM
మీ ఆధార్ కార్డుని ఎవ్వరూ దుర్వినియోగం చెయ్యకుండా ఉండాలంటే ఇలా లాక్ చేసుకోండి

ఈరోజుల్లో మనం ఏదైనా పని ఉండి ఊరు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక రోజు హోటల్ రూమ్ లో ఉండాలి అంటే, ముందు అడిగే ప్రూఫ్ మన ఆధార్ కార్డు. ఒక కార్ లేదా బైక్ రెంట్ తీసుకోవాలి అన్నా కూడా, ముందు అడిగేది ఆధార్ కార్డే. మరి అంత మంది చేతుల్లో మన ఆధార్ కార్డుని పెట్టినప్పుడు, అది కచ్చితంగా ఎక్కడో ఒక చోట దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది. మరి అలా కాకుండా ఉండాలంటే.. మన అనుమతి లేకుండా, మన ఆధార్ కార్డును ఎవ్వరూ వాడకుండా ఉండాలి అంటే, దానికి మనం ఒక పని చేయాలి. అదే ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఫీచర్. దీన్ని సెట్‌ చేసుకుంటే.. మన ఆధార్‌ కార్డ్‌ని ఎవరూ దుర్వినియోగం చేయలేరు. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుండో అందుబాటులో ఉంది, కాని చాలా మందికి దీని గురించి తెలియదు.

UIDAI అంటే ఆధార్ కార్డులను ఇచ్చే సంస్థ. వారు యూజర్ ఆధార్ సెక్యూరిటీని స్ట్రాంగ్ గా చేసేందుకు ఈ ఫీచర్‌ని తీసుకుని వచ్చింది. కాకపోతే ఈ ఫీచర్ ని ఎక్కువమంది ఎందుకు వాడడం లేదు అంటే, ఇందులో ఒక చిక్కు కూడా ఉంది. అసలు ఈ ఆధార్ బయో మెట్రిక్ లాక్ అంటే ఏమిటి.. ఇది ఎందుకు చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి.. ఇందులో ఉన్న ఆ చిక్కు ఏంటి.. దానికి పరిష్కారం ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ బయో మెట్రిక్ లాక్ అంటే ఏమిటి?

మన ఆధార్ లో మొత్తం మన చేతికి ఉన్న పది వెళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంటాయి. మన ఆధార్ ని ఎవరైనా తప్పు గా వాడి ఫేక్ సిమ్ కార్డు లాంటిది తీసుకుని, ఇల్లీగల్ పనులు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ క్రైమ్ కి వాడిన సిమ్ కార్డు మన పేరు మీద ఉంటుంది కాబట్టి, దానికి శిక్ష అనుభవించాల్సింది కూడా మనమే, అది కూడా చెయ్యని తప్పుకు. ఇలాంటి తప్పులు జరగకుండా UIDAI ఈ ఆధార్ బయో మెట్రిక్ లాక్ ఫెసిలిటీ ని మనకి కల్పించింది.

ఇప్పుడు ఈ ఫీచర్ ని యూస్ చేసి మన ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న మన ఫింగర్ ప్రింట్స్ ని టెంపరరీగా లాక్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎవరైనా మన ఆధార్ ని వాడి ఏదైనా చేయాలి అనుకున్నా కూడా అందులో మన ఫింగర్ ప్రింట్స్ లాక్ అయ్యి ఉంటాయి కాబట్టి, మన ఆధార్ చెల్లుబాటు అవ్వదు. అలాగే మళ్ళి మనకి కావలిసినప్పుడు వాటిని అన్ లాక్ చేసెయ్యొచ్చు. మన ప్రైవసీ ని సీక్రెట్ గా ఉంచడానికే ఈ ఫీచర్ ని తీసుకుని వచ్చారు.

ఆధార్ బయో మెట్రిక్ లాక్ తో కేవలం ఫింగర్ ప్రింట్స్ మాత్రమే కాదు అండి, మన పేస్ ని లాక్ చేసుకోవచ్చు. ఆధార్ లో ఉండే డిజిటల్ ఫోటోని ఎవ్వరూ మిస్ యూస్ చెయ్యకుండా.. అలానే మన కళ్ళ స్కాన్ (ఐరిష్ స్కాన్) ని కూడా లాక్ చేసుకోవచ్చు. అయితే ఈ లాక్ ని వేసినప్పుడు మన ఆధార్ మనకి కూడా ఉపయోగపడదు. మళ్లీ అన్‌లాక్‌ చేసుకునే వరకు నిరుపయగంగా ఉంటుంది.

బయోమెట్రిక్ లాక్ ఎలా చెయ్యాలి?

UIDAI వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి, తరవాత మనకి ఆధార్ సర్వీసెస్ కనిపిస్తాయి, అందులో ఉండే ఆధార్ లాక్/ అన్లాల్ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి. అప్పుడు మన ఆధార్ తో లింక్ అయ్యి ఉన్న రిజిస్టర్ నెంబర్ కి OTP వస్తుంది. దాన్ని ద్వారా లాక్ సెట్ చేసుకోవచ్చు. కాకపోతే పైన ఈ ఫీచర్ లో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పాం కదా. అది ఏంటంటే..

అసలు సమస్య ఏమిటి?

ఈ లాక్ ని సెట్ చేసుకోవడానికి కచ్చితంగా కావలిసింది రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్. ఎందుకంటే ఫోన్ నెంబర్ కి వచ్చే OTP లేకపోతే ఇక్కడ ఏ పని అవ్వదు కాబట్టి. పొరపాటున మీరు మీ ఆధార్ బయో మెట్రిక్ లాక్ వేసిన తరవాత మీ ఫోన్ పోయినట్లయితే, మీరు మళ్ళి అదే నెంబర్ ఉండే కొత్త SIM కార్డు కోసం ఆధార్ అథెంటికేషన్ చెయ్యాలి, కాని అప్పటికే మీ బయో మేట్రిక్స్ అన్ని కూడా లాక్ అయ్యి ఉంటాయి కాబట్టి, మీ ఆధార్ అక్కడ అథెంటికేషన్ చెయ్యలేదు. ఈ ఒక్క ప్రాబ్లం వల్ల ఈ ఫీచర్ ఉంది అని తెలిసి కూడా చాలా మంది ఉపయోగించుకోవడానికి ఆలోచిస్తునారు.

ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే..

సింపుల్ గా మీరు చెయ్యలిసింది ఏంటి అంటే ఆన్లైన్ లో కాకుండా దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి ఇలా నా SIM పోయింది, ఆధార్ లాక్ లో ఉంది అంటే, మిమ్మలిని వారు కొన్ని ప్రూఫ్స్ అడుగుతారు. వాటిని సబ్మిట్ చేసి మీరే ఆ మనిషి అని కన్ఫర్మ్ చేసుకున్నాకా, మళ్ళీ మీ ఆధార్ ను మీకు అన్ లాక్ చేసి ఇస్తారు. మరి ఇంకా ఎందుకు లేటు, ఇప్పుడే మీ ఆధార్ కార్డు బయో మేట్రిక్స్ ని లాక్ చేసుకోండి, మిస్ యుసుల నుండి కాపాడుకోండి.