10 ఏళ్ల వయసులో తప్పిపోయి 20 ఏళ్లకు ఇంటికి చేరింది!

పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు రమ్య. ఆమె 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కనిపించకుండాపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు చాలా రోజుల పాటు వెతికారు. కానీ, ఆ యువతి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేంలేక సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఇటీవల కనిపించకుండాపోయిన రమ్య 20 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. కూతురి రాకతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషంతో మురిసిపోతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇన్నాళ్లు ఆ యువతి ఎక్కడ ఉండిపోయిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడు పెన్నాగరం పరిధిలోని కెండయనళ్లలో గ్రామంలో రమ్య అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. అయితే ఈ అమ్మాయి 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పాఠశాల తరుఫున కర్ణాటక టూర్ కు వెళ్లి తప్పిపోయింది. దీంతో కూతురు ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంతటా గాలించారు. కానీ, ఆ యువతి ఆచూకి మాత్రం దొరకలేదు.

కట్ చేస్తే.. 20 ఏళ్ల తర్వాత రమ్య తిరిగి ఇంటికి వచ్చింది. కూతురు తిరిగి ఇంటికి రావడంతో ఆ యువతి తల్లిదండ్రులు సంతోషంతో మురిసిపోతున్నారు. కాగా, ఆ యువతి ముంబైలోని ఉన్నట్టు తెలియడంతో మహారాష్ట్రలోని పూణెలో ఉన్న బధిరుల సంస్థ మొత్తానికి రమ్యని వారి ఇంటికి చేర్చింది. కూతురు రాకను ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పండగ చేసుకుంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 10 ఏళ్ల వయసులో కనిపించకుండపాయి 20 ఏళ్ల తర్వాత ఇంటికి తిరుగొచ్చిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments