iDreamPost
android-app
ios-app

కేరళలో మరో విచిత్రమైన ఘటన! రాత్రి హాస్టల్ లో జరిగిన దారుణం!

  • Published Apr 12, 2024 | 11:55 AM Updated Updated Apr 12, 2024 | 11:55 AM

నాన్ వెజ్ అంటే దాదాపుగా అందరు ఇస్టంగానే తింటూ ఉంటారు. అందులోను సముద్రంలో దొరికే చేపలు, రొయ్యలు, పీతలు అంటే కొంతమందికి మరింత మక్కువ. అయితే తాజాగా ఒక యువతి రొయ్యలు తిని తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాన్ వెజ్ అంటే దాదాపుగా అందరు ఇస్టంగానే తింటూ ఉంటారు. అందులోను సముద్రంలో దొరికే చేపలు, రొయ్యలు, పీతలు అంటే కొంతమందికి మరింత మక్కువ. అయితే తాజాగా ఒక యువతి రొయ్యలు తిని తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 12, 2024 | 11:55 AMUpdated Apr 12, 2024 | 11:55 AM
కేరళలో మరో విచిత్రమైన ఘటన! రాత్రి హాస్టల్ లో జరిగిన దారుణం!

ఇప్పుడు మాంసాహార ప్రియులు ఎక్కువయ్యిపోయారు. చికెన్, మటన్ తో పాటు.. సీ ఫుడ్ తినే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటి ఆహారపదార్ధాలంటే మరికొంతమందికి ఎక్కువ మక్కువ. అయితే.. ఎక్కువగా అనేక సందర్భాలలో కోళ్లకు వైరస్ సోకిందనో.. లేదా బర్డ్ ఫ్లూ వచ్చిందనో వింటూ ఉంటాము. అలా కొద్దీ రోజులు చికెన్ తినడం మానేస్తు ఉంటారు కొంతమంది. అలాగే కొన్ని సంధర్భాలలో చికెన్ ను తినడం వలన ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా ఎంతో మందిని చూశాము. అయితే, ఇప్పుడు రొయ్యలు తిన్నా కూడా ప్రాణహాని జరుగుతుందట. తాజాగా ఒక ఇరవై ఏళ్ల యువతి రొయ్యలు తిని.. తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. రొయ్యలు కూడా ప్రాణాలకు హాని కలిగిస్తాయా.. అసలు ఆ మహిళ చనిపోవడానికి గల కారణాలు ఏమిటి! రొయ్యలను వండుకునేటప్పుడు అనేక జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు నిపుణులు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

కేరళలోని పాలకడ్ కు చెందిన గోపాల కృష్ణన్, నిషా భార్య భర్తలు వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు నిఖిత ఏడేళ్లుగా ఒక సంస్థలో వర్క్ చేస్తోంది. అయితే నిఖితకు రొయ్యలంటే ఎలర్జీ.. అయితే ఆమె గత రాత్రి హాస్టల్ లో రొయ్యలు తినింది. రొయ్యలు తిన్న కొద్దిసేపటికే ఆమె అస్వస్థకు గురైంది. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యం చేసిన ఉపయోగం లేకుండా పోయింది. కేవలం రొయ్యలు తినడం కారణంగానే ఆమె మృతి చెందిందని.. వైద్యులు నిర్దారించారు. దీనితో ఆమె కుటుంబం, స్నేహితులు తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. అసలు రొయ్యలు తినడం వలన ఎలా ఎలర్జీ ఏర్పడుతుంది. రొయ్యలను ఆ రకంగా తినడం వలన నిజంగానే ప్రాణానికి ప్రమాదమా.. రొయ్యల తినడం మన శరీరానికి సరిపడదు అని ఎలా గుర్తించాలి అనే విషయాల గురించి నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

రొయ్యలను వండుకునేటపుడు వాటిపైన ఉండే.. నల్లని రక్తనాళాలను తప్పని సరిగా తొలగించాలి. ఇది రొయ్యలతో వ్యర్ధాలు పేరుకునే ప్రేగు మార్గం. దీనిని తొలగించకుండా తినడం వలన అది శరీరానికి హాని కలిగిస్తుంది. శరీరం యొక్క చర్మంపై దురదలు రావడం, గోధుమ రంగు మచ్చలు ఏర్పడినట్లైతే.. ఇది ఎలర్జీకి సంకేతం. అంతే కాకుండా రొయ్యలు తిన్న తర్వాత అలసటగా అనిపించినా.. శ్వాస కోసం సంబంధితమైన సమస్యలు వస్తే మాత్రం.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి రొయ్యలను ఈ పూర్తిగా శుభ్రం చేసుకోకుండా తింటే మాత్రం ప్రాణాలకు ముప్పు తప్పదు. ఇక నుంచి ఎవరైనా సరే రొయ్యలను తినేటప్పుడు వాటిపై ఉండే రక్తనాళాలను తొలగించి తినడం మేలు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.