Keerthi
కళ్లముందు బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి కూడా చూస్తూ ఊరుకోదు. అయితే ఆ ఆపద మృత్యు రూపంలో వచ్చిన సరే ధైర్యంగా ఎదురెళ్లి పోరాడి బిడ్డను రక్షించుకుంటుంది. అవసరమైతే ఈ పోరాటంలో తన ప్రాణాలను సైతం బలితీసుకున్న పర్వాలేదు కానీ, తన బిడ్డ మాత్రం సురక్షితంగా ఉండాలని కోరుకుటుంది తల్లి మనసు. అచ్చం అలానే ఓ తల్లి కూడా కృర మృగం రూపంలో ఉన్న మృత్యువుకు ఎదురెళ్లి పోరాడి తన బిడ్డను క్షేమంగా రక్షించుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కళ్లముందు బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి కూడా చూస్తూ ఊరుకోదు. అయితే ఆ ఆపద మృత్యు రూపంలో వచ్చిన సరే ధైర్యంగా ఎదురెళ్లి పోరాడి బిడ్డను రక్షించుకుంటుంది. అవసరమైతే ఈ పోరాటంలో తన ప్రాణాలను సైతం బలితీసుకున్న పర్వాలేదు కానీ, తన బిడ్డ మాత్రం సురక్షితంగా ఉండాలని కోరుకుటుంది తల్లి మనసు. అచ్చం అలానే ఓ తల్లి కూడా కృర మృగం రూపంలో ఉన్న మృత్యువుకు ఎదురెళ్లి పోరాడి తన బిడ్డను క్షేమంగా రక్షించుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
Keerthi
ఇప్పటి వరకు గ్రామాల్లో పులులు, గజరాజలు చొరబడి హాని కలిగిస్తాయనే ప్రాణ భయంతో.. ప్రజలు బిక్కు బిక్కుమని ఉండేవారు. కానీ,ఇప్పుడు తోడేళ్ల భయంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ తోడేళ్లు మనుషుల ప్రాణాలను తోడేస్తున్నాయి. అయితే ఈ భయంకరమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిచ్ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలోని నివసించే ప్రజలకు తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లోకి చొరబడి అందరీ పై దాడులు చేస్తున్నాయి. ఇలా నెలన్నర వ్యవధిలోనే ఈ తోడేళ్లు దాదాపు ఎనిమిది మందని పెట్టనపెట్టుకోగా.. వారిలో ఏడుగురు చిన్నారులే కావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే గత మూడు నెలల క్రితం ఈ తోడేళ్ల దాడిలోని 9 మందికి పై చనిపోగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ తోడేళు మరో బాలుడిపై దాడికి దిగింది. కానీ, కన్నబిడ్డను రక్షించుకోవాలనే ఆ బాలుడి తల్లి చేసిన సాహసంపై తోడేలు వెనక్క తగ్గ తప్పలేదు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
కళ్లముందు బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి కూడా చూస్తూ ఊరుకోదు. అయితే ఆ ఆపద మృత్యువైనా, కృర మృగమైన సరే ధైర్యంగా ఎదురెళ్లి పోరాడి బిడ్డను రక్షించుకుంటుంది. అవసరమైతే ఈ పోరాటంలో తన ప్రాణాలను సైతం బలితీసుకున్న పర్వాలేదు కానీ, తన బిడ్డ మాత్రం సురక్షితంగా ఉండాలని కోరుకుటుంది తల్లి మనసు. అచ్చం అలానే ఓ తల్లి కూడా కృర మృగం రూపంలో ఉన్న మృత్యువుకు ఎదురెళ్లి పోరాడి తన బిడ్డను క్షేమంగా రక్షించుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ లోని పూరే దిల్‌దార్‌సింగ్ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు పరాస్, తన తల్లి గుడియా తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే సరిగ్గా ఆదివారం తెల్లవారుజామున ఓ వింత శబ్ధం రావడంతో ఆమె ఓక్కసారిగా మేల్కొంది. దీంతో కళ్లు తెరిచి చూసే సరికి ఎదురుగా తోడేలు తన తన కుమారుడి మెడ పట్టుకుని లాక్కెళ్తోంది.
దీంతో ఆ తల్లి ఏ మాత్రం భయపడకుండా అలస్యం చేయకుండా.. మంచంపై నుంచి శివంగిలా దూకి ఆ క్రూర జంతువు మెడ చుట్టూ రెండు చేతులు గట్టిగా బిగించి అదిమి పట్టుకుంది. అంతేకాకుండా.. సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. దీంతో వెంటనే ఆ తోడేలు ఆ బాబును వదిలి అక్కడి నుంచి పారిపోయింది.అయితే తోడేలు ఈ దాడిలో గాయపడిన బాలుడ్ని అనంతరం కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రాణాలను సైతం ఎదిరించి మృత్యువుతో పోరాడి బిడ్డ ప్రాణాలను రక్షించుకున్న ఆ మాతృమూర్తి ధైర్య సాహసాలను కుటుంబ సభ్యలతో సహా.. గ్రామస్తులంతా మెచ్చుకున్నారు. అంతేకాకుండా.. బిడ్డకు మరోసారి పునరజన్మనిచ్చిందని కొనియాడారు. ఈ సందర్భంగా పరాస్ తల్లి గుడియా మాట్లాడుతూ.. నేను నా బిడ్డను కాపాడుకోవాలనే ప్రయత్నంలో నా శక్తిని మొత్తం ఉపాయోగించి ఆ తోడేలును గొంతు పిసికి హత్యచేయాలని ప్రయత్నించాను. కానీ, అంతలోనే అది పట్టుకోల్పోయి నా బిడ్డను వదిలి పారిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. మరీ, బిడ్డ ప్రాణాల కోసం అడవి జంతువుతో పొరాడిన ఆ తల్లి ధైర్యసాహాసం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.