Swetha
సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలూ జరుగుతున్న క్షణాల్లో అందరికి తెలిసిపోతున్న విషయం పక్కన పెడితే.. ఇక్కడ ఫేమస్ అవ్వడానికి చాలా మంది చేస్తున్న వికృత చేష్టలే ఎక్కువ అయ్యిపోయాయి. ఇలానే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అతని ఫోటో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలూ జరుగుతున్న క్షణాల్లో అందరికి తెలిసిపోతున్న విషయం పక్కన పెడితే.. ఇక్కడ ఫేమస్ అవ్వడానికి చాలా మంది చేస్తున్న వికృత చేష్టలే ఎక్కువ అయ్యిపోయాయి. ఇలానే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అతని ఫోటో వైరల్ అవుతోంది.
Swetha
ప్రపంచం అంతా టెక్నాలజీ తో కలిసి పరుగులు పెడుతోంది. మారుతున్న టెక్నాలజీలో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాము. ప్రజలు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారా.. లేదా సోషల్ మీడియానే ప్రజలను ఆడిస్తుందా అనేంతలా అందరూ మారిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాటికీ బానిసలుగా మారుతున్నారు. అయితే వీరిలో మరి కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం వికృత చేష్టలు చేస్తున్న విషయాల గురించి వింటూనే ఉన్నాము. అలానే దానికి సంబంధించిన వీడియోస్ కూడా చూస్తూనే ఉన్నాము. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రాంక్ వీడియోస్ ఎక్కువగా చేయడం చూస్తూనే ఉన్నాము. మరి కొంతమందైతే ప్రాంక్ చేద్దామని చేస్తారో లేదా నిజంగానే మతి స్థిమితం కోల్పోయి చేస్తారో .. తెలియదు కానీ కొద్దీ సమయం పాటు అందరిని కంగారు పెట్టించేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా అలాంటిదే. అసలు ఏం జరిగేందంటే..
సాధారణంగా ఎక్కడైనా ట్రైన్ లోపల కూర్చునే ప్రయాణం చేస్తారు. కొంతమంది ఫేమస్ అయ్యే ప్రక్రియలో ట్రైన్ పైకి ఎక్కి డాన్స్ లు చేస్తూ అధికారులకు పట్టు బడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ట్రైన్ పై కప్పుపై పడుకుని 400 కిమీ ప్రయాణం చేశాడు. ఈ సంఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది. న్యూఢిల్లీ-గోరఖ్‌పూర్ వెళ్లే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ (12572) పైకప్పుపై ఒక వ్యక్తి పడి ఉన్నాడు. దీనితో ఈ విషయం కాన్పూర్ రైల్వే స్టేషన్ లో కలకలం రేపింది. ఆ వ్యక్తి ట్రైన్ పై కప్పు పై పడుకుని.. ఢిల్లీ, కాన్పూర్ మధ్య 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ట్రైన్ పై కప్పుపై ఏర్పడే విద్యుదుత్పత్తి కారణంగా అన్ని కిలో మీటర్లు ప్రయాణం చేసిన అతను మరణించి ఉంటాడని.. అందరూ భావించారు. కానీ, అతను బ్రతికే ఉన్నాడు.
దీనితో హుటాహుటిన పోలీసులు అందరూ ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితులను చక్కబరిచారు. ట్రైన్ పై పడుకున్న ఆ వ్యక్తి ఫతేపూర్‌లోని బింద్‌కీ తహసీల్‌లోని ఫిరోజ్‌పూర్ గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ గా గుర్తించారు. ఆ వ్యక్తిని ట్రైన్ పై నుంచి దించడం కూడా కష్టతరమైన పనిగానే మారింది. ఓవర్‌హెడ్ వైర్‌కు 25,000 వోల్ట్‌లను కలిగి ఉండే విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి.. ఆ వ్యక్తిని కిందికి దించారు. దీని కారణంగా 20 నిమిషాల పాటు అక్కడ రైలు కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత దిలీప్ కుమార్ ను అదుపులోకి తీసుకుని.. ఈ ఘటన గురించి విచారించినా కూడా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయాన్నీ అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో.. దిలీప్ కుమార్‌ని తిరిగి స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అతని కుటుంబం కాన్పూర్‌కు వచ్చిన్నట్లుగా.. అక్కడి ఇన్స్పెక్టర్ తెలియజేశారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.