P Krishna
Varanasi Gym: ప్రతిరోజూ జిమ్ కి వెళ్తూ ఫిట్ నేస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వ్యక్తి.. పది మందికి ఆరోగ్య సూత్రాల గురించి తెలిపే వ్యక్తి జీవితంలో అనూహ్య సంఘటన జరిగింది.
Varanasi Gym: ప్రతిరోజూ జిమ్ కి వెళ్తూ ఫిట్ నేస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వ్యక్తి.. పది మందికి ఆరోగ్య సూత్రాల గురించి తెలిపే వ్యక్తి జీవితంలో అనూహ్య సంఘటన జరిగింది.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా కార్డియాక్ అరెస్ట్ లు భయాందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరుకు మనతో సంతోషంగా ఉన్నావళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోవడం.. ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలో కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ హార్ట్ ఎటాక్ రవడం.. చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ గుండెపోటు కారణం పనిలో తీవ్ర ఒత్తిడి, అధిక వ్యాయామం, ఎక్కువ సేపు డ్యాన్సు చేయడం, పాటలు పాడటం, డీజే సౌండ్స్ వినడం వల్ల హార్ట్ ఎటాక్స్, రక్తపోటు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఫిట్ నెస్ తో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం జిమ్ కి వెళ్లి కుప్పకూలిపోయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో ఓ వ్యక్తి జిమ్ చేస్తూ అక్కడే కుప్పకూలిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
మనిషిని మృత్యువు ఏ రూపంలో ఆవహిస్తుందో తెలియని పరిస్థితి. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా మన కళ్లముందే మృత్యుఒడిలోకి జారుకుంటున్నారు. ఇటీవల హార్ట్ ఎటాక్ కారణంగా ఎంతో మంది కన్నుమూస్తున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోతున్నాడు. జిమ్ లో వర్క్ ఔట్ చేస్తుండగా హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ ఆస్పత్రిలో చేరేలోపు కన్నుమూశారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఇటీవల బహిరంగ మీటింగ్ లో పాల్గొన్న తారక రత్న అకస్మాత్తుగా గుండెపోటు తో స్పృహకోల్పోయి 23 రోజుల పాటు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడి చనిపోయాడు. తాజాగా జిమ్ లో వర్క్ ఔట్ చేస్తున్న ఓ యువకుడు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.
ఉత్తర్ ప్రదేశ్ వారణాసి నగరానికి చెందిన దీపక్ గుప్తా (32) ప్రతిరోజూ వ్యాయం చేస్తు ఉంటారు. పదేళ్లుగా దీపక్ జిమ్ లో వ్యాయామం చేస్తున్నాడు. తన ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. నగరంలో జరిగే ఫిట్ నెస్ కాంపిటీషన్లు పాల్గొని ఎన్నో అవార్డులు రివార్డులు గెల్చుకున్నాడు. గురువారం ఉదయం జిమ్ కు వెళ్లి వర్క్ ఔట్ చేస్తున్న సమయంలో తీవ్రమైన తలపోటుతో బాధపడ్డాడు. తల పట్టుకొని కూర్చన్న చోటే కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న కొంతమంది దీపక్ ని కూర్చోబెట్టి మంచినీరు తాగించారు. దీపక్ వణికిపోతుండటం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీపక్ ని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణాలు పోయాయని వెల్లడించారు. ప్రస్తుతం దీపక్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#DisturbingVisuals
32-Year-Old Man Dies After Collapsing in Varanasi Gym pic.twitter.com/OotbONcXdO— News Arena India (@NewsArenaIndia) May 1, 2024