Swetha
ఆస్తులు అనేవి తరతరాలుగా వస్తూనే ఉంటాయి. అలాగే ఏళ్ళు గడిచే కొద్దీ షేర్స్ విలువ పెరుగుతుందన్న విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే ఒక పెద్దాయన ఎస్బీఐ లో పెట్టిన షేర్స్ చూసిన అతని మనవడు షాక్ అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆస్తులు అనేవి తరతరాలుగా వస్తూనే ఉంటాయి. అలాగే ఏళ్ళు గడిచే కొద్దీ షేర్స్ విలువ పెరుగుతుందన్న విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే ఒక పెద్దాయన ఎస్బీఐ లో పెట్టిన షేర్స్ చూసిన అతని మనవడు షాక్ అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Swetha
ఇప్పుడున్న జనరేషన్ లోని వారంతా కూడా ఎంత పొదుపు చేద్దాం అనుకుంటే.. అన్ని ఖర్చులు అవుతూ ఉంటున్నాయి. కానీ, మన పూర్వికులు అలా కాదు.. పొదుపు నేర్చుకోవాలంటే వారి వద్ద నుంచే నేర్చుకోవాలి. పైగా ఇప్పుడు సేవింగ్స్ చేసేందుకు ఉన్న వసతులు కూడా ఆరోజుల్లో లేవు. అయినా కూడా.. వారు వారి వారి వారసుల కోసం ఎంతో జాగ్రత్తగా పొదుపు చేస్తుండే వారు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో కూడా వారికీ అవగాహనా ఉండదు. అలాంటిది 30 ఏళ్ళ క్రితమే ఒక వ్యక్తి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ కొని ఉంచారు. అప్పట్లో కేవలం రూ.500 పెట్టి కొన్నారు. ఇప్పుడు వాటి విలువ చూసిన అతని మనవడు ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
అతని మనవడి పేరు.. తన్మయ్ మోతీవాలా.. అతను చండీఘడ్ లో చిన్న పిల్లల వైద్యుడిగా పని చేస్తున్నాడు. అయితే, ఇటీవల అతని కుటుంబానికి సంబంధించి.. ఆస్తులన్నీ ఒక చోటుకు చేరినపుడు.. కొన్ని షేర్స్ సర్టిఫికెట్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1994లో కేవలం రూ.500 పెట్టి అతని తాత ఎస్బీఐ లో షేర్స్ కొన్నారని.. వాటిని విక్రయించకుండా అలా వదిలేశారంట. అయితే, ఇప్పుడు ఆ షేర్స్ విలువ.. ఎలాంటి డివిడెంట్స్ కలపకుండా.. రూ.3.75 లక్షలు అయ్యిందని అతను తెలిపాడు. 30 ఏళ్లలో 750 రేట్లు రిటర్న్స్ ఇవ్వడం అంటే.. అది అంత సాధారణ విషయం కాదని అతను పేర్కొన్నాడు. దీర్ఘకాలీక పెట్టుబడుల గురించి తెలియజేయడం కోసమే తానూ ఈ పోస్ట్ ను పెడుతున్నట్లు కూడా అతను వెల్లడించాడు.
అయితే, ఈ స్టాక్స్ ను డీమ్యాట్ అకౌంట్ లో మార్చుకునేందుకు.. అడ్రస్ విషయంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని.. దానికోసం కన్సల్టెంట్ ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఇది జరిగి 30ఏళ్ళు అయింది కాబట్టి.. వీటిని సరిచేయడానికి కొంత సమయం పడుతుందని కూడా వెల్లడించారు. అలాగే ఆ షేర్స్ ను అమ్మాలని తానూ అనుకోవడం లేదని కూడా తెలియజేశారు. దీనితో ప్రస్తుతం ఇతని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మన పెద్దవాళ్ళను చూసి నేర్చుకోవాలని, మాకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యిందని.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.