Krishna Kowshik
పున్నామ నరకం నుండి తప్పించేది కొడుకు అని భావిస్తుంటారు తల్లిదండ్రులు. అందుకే కుమారుడు పుట్టాలని పరితపిస్తుంటారు. తాము చనిపోతే కొడుకుతో తలకొరివి పెట్టించుకోవాలనుకుంటారు. కానీ తమకు ఆ అదృష్టం లేదని అనుకుంది తల్లి. కానీ
పున్నామ నరకం నుండి తప్పించేది కొడుకు అని భావిస్తుంటారు తల్లిదండ్రులు. అందుకే కుమారుడు పుట్టాలని పరితపిస్తుంటారు. తాము చనిపోతే కొడుకుతో తలకొరివి పెట్టించుకోవాలనుకుంటారు. కానీ తమకు ఆ అదృష్టం లేదని అనుకుంది తల్లి. కానీ
Krishna Kowshik
‘మాయమైపోతున్నడమ్మా మనిషిన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు’ అనే పదాలు నేటి కాలంలో అక్షర సత్యాలు. ఇరుగు పొరుగును పలకరిస్తే ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందో అని ఎవరి ఇంట్లో వాళ్లు బతికేస్తున్న రోజులివి. కాకికి కూడా ఎంగిలి మెతుకులు పెట్టలేని మనస్థత్వానికి దిగజారిపోయింది సమాజం. కానీ మానవత్వం పరిమళించే ఓ సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. కొడుకును పొగొట్టుకుని కుంగిపోతున్న తల్లి.. అంత దు:ఖంలోనూ ఓప్రాణాన్ని నిలబెట్టింది. తనకు ప్రాణ దాతగా మిగిలిన ఆ కుటుంబానికి మరో కొడుకుగా మారాడు.. అవయవ దానాన్ని స్వీకరించిన వ్యక్తి. మాతృత్వం, మానవత్వం ఒకేసారి పరిమళించిన ఈ అద్భుత ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇంతకు ఏం జరిగిందంటే…
వివరాల్లోకి వెళితే… కేరళలోని సుజన, షాజీలకు కొడుకు విష్ణు, కుమార్తె నందన ఉన్నారు. కొడుకు విష్ణు ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. కాగా, అప్పటికే విష్ణు తల్లి సుజన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఆమె చావు అంచులకు దగ్గరవుతున్న సమయంలో కొడుకు బ్రెయిన్ డెడ్ కావడం కలిచివేసింది. అంత ఆవేదనలో కూడా ఆమె మరొకరికి ప్రాణ దానం చేయాలని ఆలోచన చేసింది. ప్రభుత్వ మృత సంజీవని పథకం కింద విష్ణు గుండె, కాలేయం, కిడ్నీలు దానం చేసింది ఆ కుటుంబం. విష్ణు గుండెను పతనం తిట్టకు చెందిన అశోక్ వి నాయర్ అనే వ్యక్తికి అమర్చారు.
తనకు మరో జన్మను ప్రసాదించిన విష్ణు కుటుంబ సభ్యులను కలిసి ధ్యాంక్స్ చెప్పాలనుకున్నాడు అశోక్. ఓ సారి విష్ణు తల్లిని కలిశాడు. సుజనను ఓదార్చాడు. అశోక్ అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్లేవాడు. కొడుకు లేని వారికి అశోక్ దేవుడు ఇచ్చిన కొడుకుగా భావించారు ఆ కుటుంబ సభ్యులు. తమ బాధలను చెప్పుకునేవారు. అలా సుజన, అశోక్‌ల మధ్య తల్లికొడుకుల బంధం ఏర్పడింది. ఈ క్రమంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న సుజన ఆ వ్యాధితోనే మరణించింది. ఆమె కొడుకు విష్ణు చనిపోవడంతో.. అశోక్ అతడే కొడుకుగా మారి.. సుజనకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను తీసుకున్నాడు. ఆ ఇంటికి కొడుకుగా మారి సుజనకు తలకొరివి పెట్టాడు. ఓ రుణానుబంధమో తెలియదు కానీ.. అశోక్, తల్లి కానీ తల్లికి కొడుకుగా మారి..అంతిమ సంస్కరాలు నిర్వహించాడు. కొడుకు లేడన్న బాధ పడుతున్న ఆ కుటుంబానికి దేవుడిచ్చిన కొడుకుగా మారి..తన బాధ్యతలను నేరవేర్చాడంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.