Krishna Kowshik
కృషితో ఏదైనా సాధించవచ్చు. కొండల్ని పిండి చేయడమే కాదూ.. పెద్ద పెద్ద సంస్థల్లో భారీ ప్యాకేజీతో కొలువులు కొట్టొచ్చు. అందుకు తగ్గ శ్రమ, కృషి, పట్టుదల ముఖ్యం. ఎంత మంది పోటీలో ఉన్నా.. విజయం అటువంటి వారినే వరిస్తుంది అనడానికి ఈ యువతినే నిదర్శనం.
కృషితో ఏదైనా సాధించవచ్చు. కొండల్ని పిండి చేయడమే కాదూ.. పెద్ద పెద్ద సంస్థల్లో భారీ ప్యాకేజీతో కొలువులు కొట్టొచ్చు. అందుకు తగ్గ శ్రమ, కృషి, పట్టుదల ముఖ్యం. ఎంత మంది పోటీలో ఉన్నా.. విజయం అటువంటి వారినే వరిస్తుంది అనడానికి ఈ యువతినే నిదర్శనం.
Krishna Kowshik
ఇప్పుడు యువత నైపుణ్యాలను పుణికి పుచ్చుకుంటున్నారు. పుస్తకాలు కేవలం అవగాహనను మాత్రమే ఇస్తాయని, ప్రాక్టికల్ నాల్జెడ్ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయని తెలుసుకుంటున్నారు. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు కొన్ని ప్రత్యేకమైన కోర్సులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. చదువు అయిపోయాక.. ఏవి డిమాండ్ ఉన్నాయో ఆ కోర్సులు నేర్చుకుని, వాటిని బాగా ప్రాక్టీస్ చేసి మల్టీ నేషనల్ కంపెనీస్‌లో టెకీలుగా ఎంటర్ అవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మరికొంత మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొడితే క్యాంపస్‌లో సాఫ్ట్ వేర్ కొలువు కొట్టాలని ఆ దిశగా కసరత్తులు చేస్తుంటారు.
అయితే క్యాంపస్ డ్రైవ్స్‌లో జాబ్ కొట్టాలంటే అంత సులువు కాదూ. ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. దానికి తగ్గ టెక్నికల్ స్కిల్ కచ్చితంగా ఉండాలి. ప్రోగ్రామింగ్ చేయాలి, కోడింగ్ రాయాలి, టెస్టింగ్ చేసి, డెవలప్ మెంట్ చూపించాలి. అలాంటి వారికే ఎంఎన్‌సి సంస్థలు రెడ్ కార్పెట్ పరుస్తాయి. అయితే వీటిలో కోడింగ్ అంత తర్వగా అంతుచిక్కదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే అమ్మాయి.. అదే కోడింగ్‌లో ప్రావీణ్యం సంపాదించి.. 69 వేల మందిని ఓడించి ఏకంగా లింక్డిన్‌లో ఏడాదికి రూ. 60 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని కొల్లగొట్టింది. ఆమె పేరు ముస్కాన్ అగర్వాల్. ఐఐఐటీ-ఉనాలో ఆమె చరిత్ర సృష్టించింది. ఇప్పుడు బెంగళూరులోని కంపెనీలో గత ఐదు నెలలుగా పనిచేస్తోంది. ఆ యువతిది ఉత్తరప్రదేశ్.
గత ఏడాది టెక్ గిగ్ గీక్ గాడెస్ 2022 కోడింగ్ పోటీని నిర్వహించగా.. 69 వేల మంది మహిళా కోడర్ లను ఓడించి, విజేతగా నిలిచింది. దేశంలో ‘అగ్ర ఉమెన్ కోడర్’ అయ్యింది. ఈవెంట్‌లో ఫైనలిస్టులు.. సుమారు ప్రోగ్రామింగ్ సొల్యూషన్‌ల కోసం నాలుగు గంటల పాటు కోడ్‌లను రాసినట్లు సమాచారం. ఇందులో విజయం సాధించిన ముస్కాన్‌కు పోటీని నిర్వహించిన కంపెనీ. రూ. 1.5 లక్షల బహుమతినిచ్చింది. ఈ ప్రతిభతోనే ఆమెకు లింక్డిన్ మెంటర్ షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. 40 మంది ఎంపికైన మహిళల్లో ఆమె కూడా ఉంది. తనను తాను కొత్త సాంకేతికత, మెథడాలజీలను నేర్చుకునేందుకు, ఇప్పటికే ఉన్న సాంకేతికను మెరుగుపరిచేందుకు కొత్త విషయాలను ఆవిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తన లింక్డిన్ బయోలో పేర్కొంది ముస్కాన్