Uppula Naresh
జేబులో లక్షల డబ్బులున్నా ఆకలితో బిచ్చగాడుమృతి. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విధారక ఘటనతో స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
జేబులో లక్షల డబ్బులున్నా ఆకలితో బిచ్చగాడుమృతి. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విధారక ఘటనతో స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
Uppula Naresh
చెదిరి పోయిన జుట్టు, మాసిపోయిన దుస్తువులతో పక్కనే ఓ ప్లాస్టిక్ సంచితో రోడ్డు పక్కన ఓ బిచ్చగాడు పడిపోయి కనిపించాడు. అలా రాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అతడు అలాగే కనిపించాడు. వాహనదారులు అందరూ గమనిస్తూ ఎవరి దారిన వాళ్లు వెళ్తున్నారు తప్పా.. ఎవరూ కూడా అతడి దగ్గరకు వెళ్లి చూసిన పాపాన పోలేదు. ఓ వ్యక్తి మాత్రం మంచి మనసుతో ఆ బిచ్చగాడిని లేపే ప్రయత్నం చేశాడు. కానీ, ఎంతకు ఆమె స్పందలేదు. చేసేదేం లేక కొందరి వాహన దారుల సాయంతో ఆ యాచకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అతడు మరణించిందని నిర్ధారించారు.
అయితే, పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం.. ఆ బిచ్చగాడు రెండు రోజుల నుంచి తిండి లేక ఆకలి మంటతో చనిపోయాడని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకుని వైద్యులు, పోలీసుల మనసు ఒక్కసారిగా కరిగిపోయింది. ఇంతే కాదు.. అతడి వద్ద ఉన్న ఓ ప్లాస్టిక్ కవర్ లో ఏకంగా రూ. 1.14 లక్షలు దొరికాయని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుని స్థానికులు కంటతడి పెట్టారు. ఆస్తులు, అంతస్తులు కూడబెట్టి కడవరకు తోడు, నీడగా నిలిచే మనుషులు లేనప్పుడు ఆ జీవితానికి అర్థమే లేదని చర్చించుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిధారక ఘటనను తెలుసుకుని కొందరు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని ఓ ప్రాంతంలో ఓ బిచ్చగాడు ఓ చోట అడుక్కుని రోజూ కడుపు నింపుకుంటూ కాలాన్ని వెల్లదీసేవాడు. అలా చాలా రోజుల నుంచి అతడు ఇక్కడే ఉంటూ జీవిస్తున్నాడు ఇకపోతే.. ఇటీవల ఈ బిచ్చగాడు ఉన్నచోటే పడుకుని కనిపించాడు. మధ్యాహ్నం ఒంటి గంట దాటినా ఆ యాచకుడు నిద్రలేవలేదు. ఓ స్థానిక వ్యక్తి గమనించి అతడిని నిద్ర లేపే ప్రయత్నం చేశాడు. కానీ, ఆయన ఎంతకు స్పందించలేదు. దీంతో వెంటనే అతడు ఆ బిచ్చగాడిని.. అతడి పక్కనే ఉన్న ఓ ప్లాస్టిక్ సంచిని తీసుకుని స్థానిక ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించాడని నిర్ధారించారు.
అనంతరం ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మృతుడి వద్ద ఉన్న ఆ ప్లాస్టిక్ సంచిని పోలీసులకు అప్పగించాడు. అనంతరం పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం.. రెండు రోజుల నుంచి ఆ బిచ్చగాడు తిండిలేక ఆకలి మంటతో చనిపోయాడని వెల్లడైంది. ఈ విషయం తెలుసుకుని వైద్యులు, పోలీసులు కంటతడి పెట్టారు. మరో విషయం ఏంటంటే ఆ బిచ్చగాడి మృతదేహాన్ని ఖననం చేసే ముందు అతని వద్ద ఉన్న ఆ ప్లాస్టిక్ సంచిలో ఏముందని పోలీసులు తెరిచి చూడగా.. అందులో అక్షరాల 1.14 లక్షలు కనిపించాయి. ఆ డబ్బులను చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు.
పైసా పైసా కూడబెట్టి చివరికి కడుపుకు తిండి లేక ఆకలితో మరణించడం ఏంటని బాధపడ్డారు. ఇదే విషయం మీడియాలో కూడా రావడంతో ఆ వార్త చదివి కొందరు నెటిజన్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు. మనిషికి డబ్బుపై ఎంతో ఆశ ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లల్లో ఉన్నా.. ఇంకా సంపాదించాలనే కోరిక మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. కానీ, ఇలా ఎంత సంపాదించినా చివరి రోజుల్లో కడుపు నిండా రెండు ముద్దలు పెట్టే కుటుంబ సభ్యులు, సాటి మనుషులు లేకపోతే ఆ సంపాదన వ్యర్థమే. ఎన్నో ఆస్తులు, అంతస్తులు కూడబెట్టి కడవరకు తోడు నీడగా నిలిచే మనుషులను సంపాదించలేకపోతే ఈ జీవితం ఎందుకని తెలపడానికి ఈ బిచ్చగాడి ఘటనే ఓ చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజాగా వెలుగు చూసిన ఈ హృదయవిధారక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.