iDreamPost
android-app
ios-app

VIDEO: పుస్తకాలతో బడి బాట పట్టిన 92 ఏళ్ల బామ్మ

VIDEO: పుస్తకాలతో బడి బాట పట్టిన 92 ఏళ్ల బామ్మ

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సలీమా ఖాన్ (92) అనే వృద్ధురాలు ఇప్పుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని నిరుపిస్తూ 92 ఏళ్ల వయసులో పుస్తకాలు చేతబట్టి బడి బాట పట్టింది. ఏకంగా చిన్న పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా స్కూల్ లో పాఠాలు వింటున్నారు. ఆమె స్కూల్ కు వెళ్లడం గమనించిన కొందరు యువకులు పిల్లల మధ్య చదువుకుంటుండగా సలీమా ఖాన్ ను సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోపై సలీమా ఖాన్ స్పందిస్తూ.. నేను ఈ పిల్లల వయసులో ఉన్నప్పుడు చదువుకుందామంటే ఇక్కడ స్కూల్ లేదని, ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉండడంతో అందుకే ఇప్పుడు చదువుకుంటున్నానని ఆ వృద్ధురాలు తెలిపారు. అయితే 92 ఏళ్ల వయసులో ఈ బామ్మ స్కూల్ కు వెళ్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా ఈమెను ఆదర్శంగా తీసుకుని వీరి గ్రామంలో దాదాపు 25 మంది మహిళలు సైతం చదువుకోవడానికి వెళ్తున్నారట. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 92 ఏళ్ల వయసులో బడిబాట పట్టిన సలీమా ఖాన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.