Kolar Teacher Case: కోలార్ టీచర్ హత్య కేసులో 8 మంది అరెస్ట్.. విచారణలో అసలు నిజాలు వెల్లడి

కోలార్ టీచర్ హత్య కేసులో 8 మంది అరెస్ట్.. విచారణలో అసలు నిజాలు వెల్లడి

Kolar Government School Teacher Case: ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళ టీచర్ గా పని చేసేది. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి కూతురు ముందే ఆమెను..

Kolar Government School Teacher Case: ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళ టీచర్ గా పని చేసేది. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి కూతురు ముందే ఆమెను..

కర్ణాటకలోని కోలార్ జిల్లా ముళబాగిలు తాలూకా ముదియనూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దివ్యశ్రీ టీచర్ గా పని చేసేవారు. తన కూతురితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు లోపలకు చొరబడ్డారు. నిందితులు దివ్యశ్రీ కూతురిని చంపాలని చూశారు. దివ్యశ్రీ కూతురు పై ఫ్లోర్ లో గదిలో  కూర్చుని చదువుకుంటుంది. తన కూతురిని చంపే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న దివ్యశ్రీ వెంటనే కూతురు ఉంటున్న గది దగ్గరకు వెళ్లి తలుపు లాక్ చేసింది. ఆ సమయంలో నిందితులు దివ్యశ్రీని అతి దారుణంగా గొంతు కోసి చంపేసి వెళ్లిపోయారు. దివ్యశ్రీ కూతురు నిషా రెవ యూనివర్సిటీలో బీఈ డిగ్రీ చేస్తుంది. అయితే నిషా తన తండ్రి పద్మనాభకి కాల్ చేసి జరిగిన ఘటన గురించి చెప్పింది. ఈయన ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు.

ఈ హత్య గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్యశ్రీని చంపేసిన నిందితులు ఇంట్లో వస్తువులు గానీ, డబ్బులు గానీ దొంగతనం చేయలేదు. దీంతో ఇది పక్కా స్కెచ్ ప్రకారం చేసిన హత్య అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పగతో చేసిన హత్య గానీ ఎవరైనా సుపారీ ఇచ్చి చేయించిన హత్య గానీ అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శత్రువులు ఎవరైనా ఉన్నారా అని కుటుంబ సభ్యులను అడిగారు. కానీ తమకు ఎలాంటి శత్రువులు లేరని చెప్పారు. ఎందుకు చంపారో? చంపిన వారు ఎవరో కూడా తమకు తెలియదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోలీసులు కేసుని సీరియస్ గా తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు.

ఈ క్రమంలో పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ లో ఓ రాత్రి సమయంలో అనుమానంగా కనిపించింది. పోలీసులు సిటీ మొత్తం జల్లెడ పట్టి గ్యాంగ్ ని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రభుత్వ పాఠశాల టీచర్ హత్య కేసులో 8 మంది నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోశారు. ఆగస్టు 14న దివ్యశ్రీని (43) ఆమె కూతురు ముందే హత్య చేశారు. కోలార్ జిల్లాలోని ముత్యాలపేటలో ముళబాగిలు సిటీలో ఉన్న దివ్యశ్రీ ఇంట్లోకి చొరబడి గొంతు కోసిచంపేశారు. రంజిత్, రాహుల్, నందీష్ సహా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రంజిత్ ఏ1గా ఉన్నాడు. ఆగస్టు 14న నిందితులు సినిమా స్టైల్లో దివ్యశ్రీ ఇంటిని కబ్జా చేయాలని భావించారు. ఆమె ఇంట్లోనే ఉంటానని.. ఇంటిని ఆక్రమిస్తానని అన్నాడు. దీంతో దివ్యశ్రీ తన ఇంటిని ఇవ్వాలని నిందితులని బెదిరించింది. దీంతో నిందితులు ఆమె గొంతు కోసి హత్య చేశారు. ఈ విషయాన్ని కోలార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. నిఖిల్ వెల్లడించారు.

Show comments