Arjun Suravaram
73 Year Old Lady Driving Jaguar Car: నేటి సమాజంలో మహిళలు అన్ని విషయాల్లో ముందుంటున్నారు. డ్రైవింగ్ లో కూడా మగవారితో పోటీ పడి మరీ.. అన్ని రకాల వాహనాలను ఆపరేట్ చేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ స్పోర్ట్స్ కారు డ్రైవ్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
73 Year Old Lady Driving Jaguar Car: నేటి సమాజంలో మహిళలు అన్ని విషయాల్లో ముందుంటున్నారు. డ్రైవింగ్ లో కూడా మగవారితో పోటీ పడి మరీ.. అన్ని రకాల వాహనాలను ఆపరేట్ చేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ స్పోర్ట్స్ కారు డ్రైవ్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
Arjun Suravaram
ప్రతి ఒక్కరి ఏదో ఒక అంశంపై ఆసక్తి ఉంటుంది. చదువు, ఆటలు, సినిమాలు, డ్రైవింగ్ వంటి అనేక రకాల అంశాలపై ఆసక్తి ఉంటుంది. అందుకే కొందరికి వయస్సు మీద పడిన..చదువు వంటి వివిధ అంశాలపై మాత్రం ఆసక్తి తగ్గదు. ఇంకా చెప్పాలంటే వాటికి బానిసలు మారిపోతుంటారు. అలానే 73 ఏళ్ల బామ్మకి కూడ అలానే డ్రైవింగ్ ఎంతో ఆసక్తి ఉంది. అందుకే ఇప్పటికే ఎన్నో రకాల కార్లను నడిపిన ఆ బామ్మ తాజాగా జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారును నడుపుతూ ఆశ్యర్యపరిచారు. ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ కారుని నడుపుతున్న బామ్మ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఆ బామ్మ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో డ్రైవింగ్ చేసే మహిళల సంఖ్య పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది కారు, బస్సు వంటి వాహనాలను నడిపేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇలానే ఇప్పటికే ఎంతో మంది యువతులు బస్సులను నడిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలా అమ్మాయిలు కార్లు నడిపితే పెద్ద ఆశ్చర్యం అనిపించదు. కానీ వయస్సు మీద పడిన వారు మాత్రం కార్లు నడిపితే ఆశ్చర్యపడాల్సిందే. అలానే కేరళకు చెందిన రాధామణి అనే 73 ఏళ్ల బామ్మ జాగ్వార్ ఎఫ్ టైప్ స్పోర్టస్ కారును నడిపి.. ఔరా అనిపించారు. ఈ కారు విలువ కోటీ నుంచి కోటిన్నర మధ్య ఉంటుంది. అంత ఖరీదైన కారును రాధమణి చాలా సులువుగా డ్రైవ్ చేశారు. రాధామణికి డ్రైవింగ్ అంటే అమితమైన ఇష్టమే అందుకు కారణం.
ఏదైన కొత్త మోడల్ వాహనాన్ని నడపడం అంటే ఆమెకు ఎంతో ఆసక్తి. ఇలా డ్రైవింగ్ ను ఒక వ్యసనంలా ఆమె భావిస్తుంది. రాధామణి కేరళలోని కొచ్చిలోని A2Z డ్రైవింగ్ స్కూల్‌ని స్థాపించారు. ఈ డ్రైవింగ్ స్కూల్‌ను ఆమె భర్త 1970లో నెలకొల్పగా ఆమె కొనసాగిస్తున్నారు. 2004లో ఆమె భర్త మరణించారు. దీంతో ఆ డ్రైవింగ్ స్కూల్ ని రాధామణి గారే నిర్వహిస్తున్నారు. రాధామణి 30 ఏళ్ల వయసులోనే కారు నడపడం నేర్చుకుంది. రాధామణి డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆమె భర్త పట్టుబట్టడంతో డ్రైవింగ్ నేర్చుకుంది.
ప్రస్తుతం రాధామణి 11 రకాల కేటగిరీల్లో వాహనాలు నడపడానికి లైసెన్సులు పొందిందారు. ఎక్స్కవేటర్, ఫోర్క్లిఫ్ట్, క్రేన్, రోడ్ రోలర్, ట్రాక్టర్, కంటైనర్ ట్రైలర్ ట్రక్, బస్సు, లారీ వంటి ఎన్నో వాహనాల ఆపరేట్ చేయడానికి ఆమెకు లైసెన్స్ ఉంది. ఇక ఆమె పేరున ఓ అరుదైన రికార్డు కూడా ఉంది. కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా రాధామణి రికార్డు సృష్టించారు. తాజాగా రాధామణి గ్రీన్ కలర్ జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు డ్రైవర్ సీటులో కూర్చొని ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాధామణి కొత్త వాహనం నడిపిన ప్రతిసారీ ఇలా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆమె డ్రైవ్ చేసిన విజువల్స్ ఇంటర్‌నెట్‌లో వైరల్ అవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని, తాను యువతతో కలిసి డ్రైవింగ్ లో పోటీ పడగలని ఆమె చెబుతున్నారు. ఇలా ఆత్మవిశ్వాసంతో ఉన్న రాధామణి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ అని ఆమె చెప్పారు.
View this post on Instagram
A post shared by A2Z Heavy Equipment Institute (@a2z_heavy_equipment_institute)