iDreamPost
android-app
ios-app

మరోసారి కేరళని ముంచేసిన వరద! ఊర్ల మీదకి వచ్చేస్తున్న నదులు!

Wayanad Landslides: కేరళ రాష్ట్రం వయనాడ్ లో భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడడంతో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వందలాది మంది వరదల్లో చిక్కుకుపోయారు.

Wayanad Landslides: కేరళ రాష్ట్రం వయనాడ్ లో భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడడంతో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వందలాది మంది వరదల్లో చిక్కుకుపోయారు.

మరోసారి కేరళని ముంచేసిన వరద! ఊర్ల మీదకి వచ్చేస్తున్న నదులు!

దేశ వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాలతో విరుచుకుపడుతున్నాడు. భారీగా కురుస్తున్న వానలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వానల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్తుతున్నాయి. వరదలు అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. వానల కారణంగా పలువురు మృతిచెందుతున్నారు. ముఖ్యంగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. వయనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో కొండచరియలు విరిగిపడి, బురద కొట్టుకురావడంతో 70 మంది జలసమాధి అయ్యారు. ఎక్కడ చూసిన మృత దేహాలతో హృదయవిధారక దృష్యాలు కంటతడిపెట్టిస్తున్నాయి.

ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో వయనాడ్ పరిస్థితిని చూస్తే అర్ధమవుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా వయనాడ్ లో వందలాది కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఇప్పటికి కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100కు పైగా మంది గాయాలపాలు కాగా వందలాదిమంది వరదల్లో గల్లంతయ్యారు. 70 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. తల, కాళ్లు, చేతులు లేని మృత దేహాలను చూసి నెటిజన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జనజీవనం, రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. నిలువ నీడ లేక బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు బాధితులు.

భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇడుక్కి, త్రిసూర్, పాలక్కడ్, మళ్లపురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్.. ఈ 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పర్యాటక ప్రాంతాలకు నెలవైన వయనాడ్ లో ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు పర్యాటకులు. ముండక్కై అనే గ్రామంలో కొండచరియలు విరిగి పడి ఇళ్లు ధ్వంసం అయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. వయనాడ్ లో మృత్యు ఘోష వినిపిస్తోంది.

భారీ రెస్క్యూ ఆపరేషన్:

వయనాడ్ లో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రధానమంత్రి కార్యాలయం రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50,000 అందజేయనుంది.