చికెన్ బిర్యానీ కారణంగా..విద్యార్థి అడ్మిషన్ రద్దు! ఏం జరిగిందంటే..

Rajasthan News: సాధారణంగా విద్యార్థులు తమ లంచ్ బాక్స్ లో వివిధ రకాల ఆహార పదార్థులు తెచ్చుకుంటారు. అలానే ఓ విద్యార్థి బిర్యానీ తెచ్చుకున్నాడు. అయితే దీని కారణంగా ఆ ఏడేళ్ల విద్యార్థి తన అడ్మిషన్ కోల్పోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

Rajasthan News: సాధారణంగా విద్యార్థులు తమ లంచ్ బాక్స్ లో వివిధ రకాల ఆహార పదార్థులు తెచ్చుకుంటారు. అలానే ఓ విద్యార్థి బిర్యానీ తెచ్చుకున్నాడు. అయితే దీని కారణంగా ఆ ఏడేళ్ల విద్యార్థి తన అడ్మిషన్ కోల్పోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

చాలా మందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చికెన్, మటన్ బిర్యానీ అంటే పడి చస్తారు. మరికొందరికి  అయితే ముక్కలేనిది ముద్ద నోట్లోకి దిగదు. అందుకే ఆఫీసుకు వెళ్లిన, మరెక్కడికి వెళ్లిన భోజనంలో మాత్రం నాన్ వెజ్  ఉండాల్సిందే. తాజాగా ఓ ప్రాంతంలో చికెన్ బిర్యానీ పెద్ద రచ్చే చేసింది. చికెన్ బిర్యానీ కారణంగా ఓ విద్యార్థి స్కూల్ అడ్మిషన్ రద్దైంది. బిర్యానీ కారణంగా  అడ్మిషన్ రద్దు కావడం ఏంటని మీరు షాక్ అవుతున్నారా?. మీరు విన్నది నిజమే..ఏడేళ్ల బాలుడు లంచ్ బాక్స్ లో చికెన్ బిర్యానీ తెచ్చుకోవడం జరిగింది. చివరకు అది ఆ బాలుడి అడ్మిషన్ రద్దు అయ్యేందుకు కారణమైంది. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్ లోని అమ్రోహా ప్రాంతంలోని హిల్టన్ పబ్లిక్ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడు చదువుతోన్నాడు. గత గురువారం లంచ్ బాక్సులో చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాడు. అలా బాలుడు నాన్ వెజ్ బిర్యానీ తీసుకురావడంపై పాఠశాల యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాక అందరిని ఆశ్చర్యానికి కలిగించే నిర్ణయం తీసుకుంది. చికెన్ బిర్యాని తెచ్చుకున్నందుకు ఆ బాలుడి అడ్మిషన్ రద్దు చేసింది. స్కూల్ యాజమాన్యంకి, బాలుడి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బాలుడితో పాటు అతడి తోబుట్టువులు ఇద్దరు అదే స్కూల్ లో చదువుతున్నారు.

వారి ముగ్గురిని వేరే స్కూల్ కు మార్చించాలని ఆ పిల్లల తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఇక ఆ పిల్లల అడ్మిషన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు విద్యా శాఖ ముందుకొచ్చింది. అలాగే, హిల్టన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం బకాయి ఉన్న రూ. 37 వేల  ఫీజును మాఫీ చేయడానికి అంగీకరించింది. అయితే ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే ప్రిన్సిపాల్‌ ను రెండు రోజుల కిందట సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని నొయిడాలోని ఓ పాఠశాలలో కూడా విద్యార్థులు తమ లంచ్ బాక్సులో నాన్-వెజ్ తీసుకురావద్దని షరతు పెట్టింది. తమ స్కూల్‌ కు వచ్చే విద్యార్థులకు “నో నాన్ వెజ్ లంచ్ బాక్స్ రూల్‌”ను పెట్టడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments