iDreamPost
android-app
ios-app

ఆ ఇంట్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన 60 పాములు.. ఎక్కడంటే?

ఆ ఇంట్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన 60 పాములు.. ఎక్కడంటే?

మాములుగా పాములంటే చాలా మందికి భయం. ఒక వేళ అదే పాము మన ఇంట్లో కనిపిస్తే ఇక అంతే.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. కానీ, బీహార్ లోని ఓ ఇంట్లో మాత్రం.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 60 పాములు ఒకేసారి కనిపించాయి. వినటానికే భయంకరంగా ఉన్న ఇది నిజం. ఆ ఇంటి కుటుంబ సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు ఆ పాములను స్వాధీనం చేసుకున్నారు.

బీహార్ రోహ్తాస్ పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ ఫ్యామిలీ నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల వారి ఇంట్లో ఓ పాము కనిపించింది. కుటుంబ సభ్యులు స్పందించి స్థానికుల సహకారంతో ఆ పామును పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అదే ఇంట్లో మరో పాము కనిపించింది. ఇలా గంట వ్యవధిలోనే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 60 పాములు కనిపించాయి. వీటిని చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అంతా ఖంగుతిన్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు.. ఆ పాములన్నిటినీ పట్టుకున్నారు. ఈ పాములన్నీ విషము కలిగిన ఇండియన్ కోబ్రా జాతికి చెందినవని అధికారులు తెలిపారు.