5 Men Harassed Woman: రోడ్డు మీద అమ్మాయిని బైక్‌పై వెంబడిస్తూ వేధిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్

రోడ్డు మీద అమ్మాయిని బైక్‌పై వెంబడిస్తూ వేధిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్

5 Men Follows Woman On Road: ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని చర్యలు తీసుకున్నా గానీ అమ్మాయిల మీద దాడులు ఆగడం లేదు. అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఆగడం లేదు. దేశంలో రోజూ ఏదో మూలన అమ్మాయిలని వేధించేవాళ్ళు, అత్యాచారం చేసేవాళ్ళు అరెస్ట్ అవుతున్నా గానీ జనాల్లో భయం అనేది రావడం లేదు.

5 Men Follows Woman On Road: ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని చర్యలు తీసుకున్నా గానీ అమ్మాయిల మీద దాడులు ఆగడం లేదు. అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఆగడం లేదు. దేశంలో రోజూ ఏదో మూలన అమ్మాయిలని వేధించేవాళ్ళు, అత్యాచారం చేసేవాళ్ళు అరెస్ట్ అవుతున్నా గానీ జనాల్లో భయం అనేది రావడం లేదు.

ఆఫీసుల్లో, బయట, ఇంట్లో ఇలా ఎక్కడా కూడా అమ్మాయికి రక్షణ అనేది లేకుండా పోతుంది. అడుగు తీసి బయటపెడితే ఏం జరుగుతుందో అన్న భయమే ఇంట్లో వాళ్ళని వెంటాడుతోంది. అమ్మాయి బయటకు వెళ్తే గుండెల మీద చేయి వేసుకుని ఉండే తల్లిదండ్రులు ఎంతమంది. అనుక్షణం భయపడే పరిస్థితి. ఒకపక్క కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యచారం విషయంలో దేశమంతా అట్టుకుడికిపోతుంటే.. కొంతమందిలో ఇంత కూడా భయం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని చర్యలు తీసుకున్నా గానీ మార్పు అనేది రావడం లేదు. అమ్మాయిని ఏమైనా చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేకుండా బతికేస్తున్నారు చాలా మంది. భయం లేకపోగా బహిరంగ ప్రదేశాల్లోనే అమ్మాయిలని వేధిస్తున్నారు.

తాజాగా ఒక అమ్మాయిని ఐదుగురు వ్యక్తులు నడిరోడ్డు మీద రాత్రి సమయంలో అందరి ముందు వేధింపులకు గురి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ యువతి రాత్రి సమయంలో స్కూటీపై వెళ్తుంది. అదే సమయంలో అటుగా బైక్ లపై వెళ్తున్న ఐదుగురు యువకులు యువతిని వెంబడించడం మొదలుపెట్టారు. రెండు బైక్ లపై ఐదుగురు యువకులు ఆ యువతిని చాలా దూరం వరకూ వెంబడించారు. యువతి స్కూటీకి రెండు వైపులా చెరో బైక్ ని పోనిస్తూ ఆమెను వేధించారు. ఒక బైక్ మీద ముగ్గురు, మరో బైక్ మీద ఇద్దరు కూర్చుని ఆ యువతిని చాలా సేపటి వరకూ వెంబడించారు. బైక్ డ్రైవ్ చేస్తున్న ఎవ్వరికీ హెల్మెట్ లేదు. ఎడమ పక్కనున్న బైక్ వాడు అయితే కాలితో స్కూటీని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. యువతి ఒక్కర్తే ఉండడంతో వారిని ఏమీ చేయలేకపోయింది. అప్పటికీ వేగంగా డ్రైవ్ చేస్తుంది. వీళ్ళు కూడా అంతే వేగంగా అమ్మాయిని వెంబడిస్తున్నారు.

యితే ఓ ట్రాఫిక్ పోలీస్ కనిపించడంతో ఆ యువతి స్కూటీ ఆపి వేధిస్తున్నారని వెల్లడించింది. అప్పటికే ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు. యువకులు బైక్ లపై యువతిని వెంబడించిన దృశ్యాలను వెనుక నుంచి వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఘటన జరిగిన రాత్రే పోలీసులు కేసు నమోదు చేశారు. యాంటీ రోమియో టీమ్ ని పంపించి అమ్మాయిని వేధించిన వారిలో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. బైక్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకో ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉందని.. వారిని కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే అమ్మాయిని పబ్లిక్ ప్లేస్ లో ఐదుగురు వ్యక్తులు వేధిస్తుంటే ఎవరూ కూడా అమ్మాయిని కాపాడేందుకు ముందుకు రాలేదు. వీడియో తీసేవారు కూడా ఆపాలన్న ఇంగితం లేకుండా పోయిందా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments