Arjun Suravaram
దేశంలో ఉన్న అన్ని రంగాల్లో ప్రధానమైన వాటిల్లో బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి. ఎన్నో పనులు ఈ సెక్టార్లో జరుగుతుంటాయి. అలానే నిత్యం ఎంతో మంది బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటారు. తాజాగా బ్యాంకు ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఒకటి వైరల్ అవుతోంది.
దేశంలో ఉన్న అన్ని రంగాల్లో ప్రధానమైన వాటిల్లో బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి. ఎన్నో పనులు ఈ సెక్టార్లో జరుగుతుంటాయి. అలానే నిత్యం ఎంతో మంది బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటారు. తాజాగా బ్యాంకు ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఒకటి వైరల్ అవుతోంది.
Arjun Suravaram
సాధారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవు ఉంటుంది. దీంతో వారు కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేసి.. శని, ఆదివారాలు సెలవు విశ్రాంతి తీసుకుంటారు. ఐదు రోజుల పని దినాలు అనేది చాలా మంది కోరుకుంటారు. కానీ సాఫ్ట్ వేర్ లాంటి ఉద్యోగులకు మాత్రం ఆ అవకాశం ఉంది. కానీ ఇదే పద్ధతిని బ్యాంకింగ్ రంగంలోనూ అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ వార్త బ్యాంకు ఉద్యోగులకు శుభవార్తే అని చెప్పాలి. మరి.. ఎప్పటి నుంచి అమలు కానుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
దేశంలో ఉన్న అన్ని రంగాల్లో ప్రధానమైన వాటిల్లో బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి. ఎన్నో పనులు ఈ సెక్టార్లో జరుగుతుంటాయి. అలానే నిత్యం ఎంతో మంది బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటారు. అలానే ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులు అనేక సదుపాయాలను సేవలను అందిస్తున్నాయి. అదే సమయంలో ఈ రంగానికి సంబంధించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఈక్రమంలోనే తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.
ఐదు రోజుల పనిదినాలు అనే పద్ధతిని భారతీయ బ్యాంకింగ్ రంగంలోనూ తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ వార్త బ్యాంక్ కస్టమర్లకు ఆశ్చర్యంతో పాటు ఆందోళనను కలిగిస్తోంది. వారంలో రెండు రోజులు బ్యాంకులు పనిచేయకపోతే వినియోగదారులు ఇబ్బంది పడతారని, అలానే వారు అందించే సేవలకు అంతరాయం ఏర్పడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ సంఘాలు ఈ ఐదు రోజుల పనిదినాల విధానాన్నిఅంగీకరించాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఇంకా ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు.
ఐదు రోజులు పనిదినాలు అమలు చేస్తే.…రోజువారీ పని గంటలను పొడిగించడాలని, అలానే డిజిటల్, ఏటీఎం వంటి సేవలను పెంచే చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదన అమలులోకి వస్తే బ్యాంకుల పని వేళల్లో మార్పులు ఉంటాయని సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం.. బ్యాంకులు తమ పని వేళలను మార్చుకుంటాయని సమాచారం… కొత్త పని గంటలు ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉండవచ్చు.
దీని ద్వారా అదనపు రోజు నుంచి పని సమయాన్ని కవర్ చేసేందుకు రోజుకు 40 నిమిషాలు అదనంగా బ్యాంకు ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుందని సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం బ్యాంకులకు ఆదివారంతో పాటు ప్రతి రెండు, నాలుగో శనివారాలు హాలీ డేస్ ఉన్న సంగతి తెలిసిందే. మరి.. బ్యాంకింగ్ సెక్టార్ గురించి వైరల్ అవుతోన్న ఈ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.