Arjun Suravaram
Delhi Rave Party: ఒకప్పుడు రేవ్ పార్టీలు అంటే ఎక్కడో సిటీ శివారుల్లో ఫామ్‌హౌజ్‌ల్లో జరిగేవి అనుకునే వాళ్లం. కానీ మధ్యకాలంలో ఏకంగా అపార్ట్‌మెంట్‌లోనే రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. తాజాగా జరిగిన ఓ రేవ్ పార్టీలో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
Delhi Rave Party: ఒకప్పుడు రేవ్ పార్టీలు అంటే ఎక్కడో సిటీ శివారుల్లో ఫామ్‌హౌజ్‌ల్లో జరిగేవి అనుకునే వాళ్లం. కానీ మధ్యకాలంలో ఏకంగా అపార్ట్‌మెంట్‌లోనే రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. తాజాగా జరిగిన ఓ రేవ్ పార్టీలో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
Arjun Suravaram
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రేవ్ పార్టీ. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడంతో ఈ పదం ఎక్కువగా వైరల్ అయ్యింది. ఆ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలో పట్టుబడ్డారు. ఇక ఆ ఇష్యూపై ప్రస్తుతం బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో తరుచూ ఇలాంటి రేవ్ పార్టీలపై పోలీసులు దాడులు చేసి..అరెస్టులు చేస్తున్నారు. అయినా కూడా ఏదో ఒక ప్రాంతంలో ఈ పార్టీ జరుగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ నగరంలో రేవ్ పార్టీ చేసుకుంటూ 35 మంది యువతి యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరంత 16 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్సు వారే కావడం గమన్హారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
శుక్రవారం రాత్రి ఢిల్లీ నగర పరిధిలోని నోయిడా సెక్టార్-94 లోని సూపర్ నోవా రెసిడెన్షియల్ లోని ఓ ప్లాట్ లో కొందరు కాలేజీ విద్యార్థులు రేవ్ పార్టీ చేసుకుంటారు. ఆ భవనంలోని 19వ అంతస్తులో వీరు రేవ్ పార్టీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 19వ ఫ్లోర్ నుంచి మద్యం బాటిల్ కింద పడింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న ప్రాంతపై దాడి చేశారు. పోలీసులు దాడి చేసిన క్రమంలో అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా మంది యువతియువకులు మద్యం తాగుతూ డ్యాన్సులు చేస్తూ కనిపించారు. ఇక ఈ దాడిలో 35 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు.
ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వయస్సు 16 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్సు వారేనని పోలీసులు గుర్తించారు. మరికొందరు అయితే 16 ఏళ్ల కంటే తక్కువ ఉన్న యువత కూడా ఉన్నారు. వారు మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇక పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను, హుక్కాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుడిన యువతీ యువకులను విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాట్సాప్ ద్వారా తాము రేవ్ పార్టీలకు ఆహ్వానం పంపుకున్నట్లు వారు తెలిపారు. వాట్సాప్ లో పార్టీ కోసం విద్యార్థులను ఆహ్వానించినట్లు, ఒక్కొక్కరి నుంచి రూ.500, అదే జంటకు అయితే రూ.800 ఫీజుగా నిర్ణయించినట్లు పోలీసుల విచారణలో తెలింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో తెలంగాణలోని మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలోని క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరిగింది. రంగారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) ఆ రేవ్ పార్టీని ఛేదించింది. అయితే తాజాగా ఢిల్లీలో పట్టుబడిన వారందరూ మైనర్లు కావడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Empty liquor bottles started falling from the 19th floor..
📍Supernova building, Noida
When the police arrived, they found 25 boys and girls… A high profile rave party was going on.
The students are saying that their age is between 19-21.pic.twitter.com/bkVhRPL6Ix— ShoneeKapoor (@ShoneeKapoor) August 10, 2024