P Venkatesh
పానీపూరీ తిందామనుకుంటున్నారా? పానీపూరీ ప్లేట్ ధర ఎంతో తెలిస్తే షాకవ్వకుండా ఉండలేరు. అక్కడ ప్లేట్ పానీ పూరీ తినాలంటే ఏకంగా రూ. 333 చెల్లించాల్సిందే. ఇంతకీ ఎక్కడంటే?
పానీపూరీ తిందామనుకుంటున్నారా? పానీపూరీ ప్లేట్ ధర ఎంతో తెలిస్తే షాకవ్వకుండా ఉండలేరు. అక్కడ ప్లేట్ పానీ పూరీ తినాలంటే ఏకంగా రూ. 333 చెల్లించాల్సిందే. ఇంతకీ ఎక్కడంటే?
P Venkatesh
స్ట్రీట్ ఫుడ్ లలో ఎక్కువ మంది ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే అది పానీపూరీ అని చెప్పవచ్చు. పానీపూరీ టేస్టుకు అలవాటు పడిన వారు తినకుండా ఉండలేరు. రోడ్డుపక్కన పానీపూరీ బండి కనిపిస్తే చాలు ఆటోమేటిక్ గా అడుగులు అటువైపే పడుతుంటాయి. ఈ పానీపూరీని అన్ని ఏజ్ గ్రూపుల వారు తినడానికి ఇంట్రస్టు చూపిస్తుంటారు. అయితే ఎక్కువ శాతం అమ్మాయిలే పానీపూరీ తింటుంటారు. ధర కూడా తక్కువగా ఉండడంతో పానీపూరీ తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే పానీపూరీ ప్లేట్ మహా అయితే 20 లేదా 30 ఉంటుంది. కొన్ని కాస్ట్లీ హోటల్స్ లో అయితే ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. కానీ అక్కడ ప్లేట్ పానీపూరీ ఎంతో తెలుస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. అక్కడ పానీపూరీ తినాలంటే ఏకంగా ప్లేట్ కు రూ. 333 చెల్లించాల్సిందే.
పానీపూరీ తిందామనుకున్న ఓ వ్యాపారవేత్తకు షాక్ తగిలింది. ప్లేట్ పానీపూరీ ధర చూసి నివ్వెరపోయాడు. ముంబై ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఓ ఫుడ్ స్టాల్‌కు వెళ్లాడు ఆ వ్యాపారవేత్త. అక్కడ ప్లేట్ పానీపూరీ రూ.333 అని రాసి ఉండటం చూసి కళ్లు తేలేశాడు. ద్యావుడా ప్లేట్ పానీపూరీ ఇంత రేట్ ఏంటి అని ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ఫోన్ తో దాని ఫోటో తీసి కౌశిక్ ముఖర్జీ అనే బిజినెస్‌మెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్టులో ఉండే ఫుడ్ స్టాల్స్‌లోని ఫుడ్ చాలా ఖరీదు అని తెలుసు కానీ.. మరీ అంత కాస్ట్ లీ అని తెలియదు అని పేర్కొన్నాడు. ఆ ఫోటోలో పక్కనే దహీ పూరీ, సెవ్ పూరీ కూడా ప్లేట్‌కు రూ.333 ఉండటం గమనార్హం.
ఒక్కో ప్లేట్‌లో 8 పానీపూరీలు మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టు నెట్టింటా వైరల్ గా మారడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎయిర్ పోర్టులో అయితే మాత్రం మరీ ఇంత రేట్లా అంటూ మండిపడుతున్నారు. పట్టపగలే నిలువుదోపిడీ చేస్తున్నారంటు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత పన్నీర్‌ను కూడా బంగారం షాపుల్లో చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తారేమో అంటూ బాలీవుడ్ సినిమా “త్రీ ఇడియట్స్”లో అమీర్ ఖాన్ చెప్పే డైలాగ్‌ను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. మరి పానీపూరీ ప్లేట్ 333 అమ్మడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Real estate is expensive for food stalls at the CSIA Mumbai airport – but I didn’t know THIS expensive 👀 pic.twitter.com/JRFMw3unLu
— Kaushik Mukherjee (@kaushikmkj) April 29, 2024