iDreamPost
android-app
ios-app

25 లక్షల జీతం.. అయినా ఏం మిగలడం లేదు: ఓ యువకుడి ఆవేదన

  • Published Aug 13, 2024 | 4:10 AM Updated Updated Aug 13, 2024 | 9:41 AM

25 LPA But No Savings: ఏడాదికి 25 లక్షల జీతం వస్తే మీరేం చేస్తారు? ఎంత ఖర్చు పెడతారు? నెలకు లక్షన్నర జీతం వస్తే లక్ష ఖర్చు పెట్టి 50 వేలు అయినా మిగుల్చుకుంటారు కదా. కానీ ఈ యువకుడికి నెలకు లక్షన్నర వచ్చినా ఏమీ మిగలడం లేదట.

25 LPA But No Savings: ఏడాదికి 25 లక్షల జీతం వస్తే మీరేం చేస్తారు? ఎంత ఖర్చు పెడతారు? నెలకు లక్షన్నర జీతం వస్తే లక్ష ఖర్చు పెట్టి 50 వేలు అయినా మిగుల్చుకుంటారు కదా. కానీ ఈ యువకుడికి నెలకు లక్షన్నర వచ్చినా ఏమీ మిగలడం లేదట.

25 లక్షల జీతం.. అయినా ఏం మిగలడం లేదు: ఓ యువకుడి ఆవేదన

జీతం ఈ పేరు వినడానికి అకౌంట్ లో పడ్డరోజు ఎంత బాగుంటుందో.. అదే పేరు అకౌంట్ ఖాళీ అయినప్పుడు వినాలంటేనే బాధ, అసహనం కలుగుతుంది చాలా మందికి. పెరిగిపోయిన జీవన ప్రమాణాలు, విధానాలు, నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు, ఫోన్ రీఛార్జులు, మెయింటెనెన్సులు, సినిమాలు, పిల్లల స్కూలు ఫీజులు ఇలా సరదా తీర్చేసే ఖర్చులు చాలానే ఉంటాయి. ముప్పై ఒకటో తారీఖున వచ్చిన జీతం ఒకటో తారీఖున కనిపించదు. 30 రోజుల కష్టం ఒక్కరోజులోనే ఆవిరైపోతుంది. జీతం పెరిగితే బాగుణ్ణు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఉద్యోగులే కాదు.. బిజినెస్ లు చేసేవారు కూడా ఆదాయం పెరిగితే బాగుణ్ణు అని అనుకుంటారు. నెలకు లక్ష రూపాయలు వస్తే ఏ బాధలు ఉండవు అని అనుకుంటారు కదా. కానీ ఇతనికి ఏడాదికి 25 లక్షల జీతం వస్తున్నా గానీ సరిపోవడం లేదంట ఈ యువకుడికి.

సౌరవ్ దత్త అనే యువకుడు తనకు ఏం మిగలడం లేదంటూ ఆవేదనతో ఒక పోస్ట్ పెట్టారు. ఏడాదికి 25 లక్షల జీతం అనేది తన కుటుంబాన్ని పోషించడానికి చాలా చిన్న అమౌంట్ అని.. నెలకు లక్షన్నర జీతం అని ఆ యువకుడు అన్నారు. కుటుంబంలో ముగ్గురం ఉంటామని.. రెంట్ కి, ఈఎంఐకి, ఇతర అవసరాలకు ఒక లక్ష ఖర్చు అయిపోతుందని.. తినడానికి, సినిమాలకు, డైలీ ట్రిప్స్ కి 25 వేలు ఖర్చు అవుతున్నాయని అన్నారు. ఇక 25 వేలు ఎమర్జెన్సీ, మెడికల్ కోసం ఖర్చు అయిపోతున్నాయని అన్నారు. ఎందులో అయినా పెట్టుబడి పెట్టి డబ్బుని పొదుపు చేయడానికి గానీ ఆదాయం పెంచుకోవడానికి గానీ అసలు జీతమే మిగలడం లేదు అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే లగ్జరీగా జీవించు లేదా పెట్టుబడి పెట్టు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. సినిమాలకు, బయట తినడానికి 25 వేలు ఖర్చు పెడుతున్నావు కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఖర్చు పెట్టడం లేదు.. ఇండియన్స్ విచిత్రమైన మనుషులు అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఇతనే కాదు.. చాలా మంది లక్షలు జీతాలు ఉన్నవాళ్లు కూడా ఇతనిలానే బాధపడుతున్నారు. నెల జీతం మిగలడం లేదని అంటున్నారు. ఎంత జీతం వచ్చినా ఆ స్థాయికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయనేది యూనివర్సల్ ఫార్ములా. మరి అదే జీతం మీకు వస్తే ఏం చేస్తారు? ఎలా ఖర్చు పెడతారు? ఎంత పొదుపు చేస్తారు? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.