iDreamPost
android-app
ios-app

8వ తరగతిలోనే చదువుకు గుడ్ బై.. 15 ఏళ్లకే స్టార్టప్ కంపెనీ!

Kerala: ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంశంలో విశేషమైన ప్రతిభ ఉంటుంది. అందుకే ఎంతో మంది చదువులేకపోయినా తమదైనా ప్రతిభతో విజేతలుగా నిలిచారు. అలానే తాజాగా ఓ యువకుడు స్టోరీ నేటితరం యువతకు స్ఫూర్తి గా నిలిచింది.

Kerala: ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంశంలో విశేషమైన ప్రతిభ ఉంటుంది. అందుకే ఎంతో మంది చదువులేకపోయినా తమదైనా ప్రతిభతో విజేతలుగా నిలిచారు. అలానే తాజాగా ఓ యువకుడు స్టోరీ నేటితరం యువతకు స్ఫూర్తి గా నిలిచింది.

8వ తరగతిలోనే చదువుకు గుడ్ బై.. 15 ఏళ్లకే స్టార్టప్ కంపెనీ!

ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తుంది. అలానే కేవలం చదువుకున్న వారిలోనే ప్రతిభా, నైపుణ్యాలు ఉంటాయని అనుకోవడం పొరపాటు. మనిషిలోని ఆలోచన శక్తికి, చదువుకు అసలు సంబంధం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశంలో విశేషమైన ప్రతిభ ఉంటుంది. అందుకే ఎంతో మంది చదువులేకపోయినా తమదైనా  ప్రతిభతో విజేతలుగా నిలిచారు. అలానే తాజాగా ఓ యువకుడు స్టోరీ నేటితరం యువతకు స్ఫూర్తి గా నిలిచింది. 8వ తరగతిలోనే చదువు మానేసిన ఆ కుర్రాడు.. 15 ఏళ్లకే స్టార్ట్ ప్ కంపెనీలను ప్రారంభించారు. ప్రస్తుతం వీటిలో సక్సెస్ గా దూసుకెళ్తున్నాడు..కేరళకు చెందిన ఈ యువకుడు.. అతడి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కేరళ రాష్ట్రం ఎర్నాకుల జిల్లాకు చెందిన ఉదయ్ శంకర్ అనే పదిహేనళ్లు యువకుడు హాట్ టాపిక్ గా మారాడు. అందుకు కారణం.. అతి పిన్నవయస్సులో అతడు సాధించిన అసాధారణ విజయాలు. 15 ఏళ్ల వయస్సు అంటే.. చాలా మంది యువకులు తమ తోటి వారితో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఏదైనా సాధించాలని అనే తప్పన ఎవరికి రాదు. అందులోనూ 15 ఏళ్ల వయస్సు అంటే.. 10వ తరగతి చదువుతుంటారు. కానీ ఉదయ్ శంకర్ మాత్రం అందిరికి భిన్నంగా ఉన్నాడు. అంతేకాక తాజాగా చాలా మంది యువతకు ఆదర్శంగా కూడా నిలిచాడు.

టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో 8వ తరగతిలో చదువును మధ్యలోనే ఆపేశాడు. అనంతరం ఏఐకి సంబంధించిన పలు అంశాల్లో నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. ఉదయ్‌ శంకర్‌ 4వ తరగతిలోనే రోబోటిక్స్‌ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆన్‌లైన్లో పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ పై కూడా శిక్షణ తీసుకున్నాడు. ఇక  పదిహేనాళ్ల వయస్సుకే కృత్రిమమేధ (ఏఐ) కంపెనీని ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటివరకు 7 ఏఐ యాప్‌లు, 9 కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్, సుమారు 15 రకాల గేమ్‌లను శంకర్‌  రూపొందించాడు. అలానే అతడి పేరు మీద మూడు పేటెంట్లు ఉన్నాయి. మరో నాలుగింటికి కోసం శంకర్ దరఖాస్తు కూడా చేశాడు. 2023లో ఏపీజే అబ్దుల్‌ కలాం ఇగ్నైటెడ్‌ మైండ్‌ చిల్డ్రన్‌ క్రియేటివిటీ అండ్‌ ఇన్నోవేషన్‌ అవార్డు గెల్చాడు. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఐఐటీ కాన్పుర్‌ల నుంచి ఏఐ సర్టిఫికెట్‌ కోర్సులు చేశాడు.

ఇదే సమయంలో దూరవిద్య ద్వారా పదో తరగతిని పూర్తి చేశాడు. 2020 లో ఉరవ్‌ అడ్వాన్స్‌డ్‌ లెర్నింగ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్టార్టప్‌ కంపెనీ స్థాపించాడు. అంతేకాక దానికి ప్రధాన సాంకేతి అధికారిగా ఆఫీసర్‌ ఆయనే ఉన్నట్లు తెలిపాడు. ఏఐ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, గేమ్‌ డెవలప్‌మెంట్‌ వంటి కోర్సుల్లో శంకర్‌ ఇప్పుడు ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇక ఉదయ్ శంకర్ సక్సెస్ పై ఆయన తండ్రి డాక్టర్ రవికుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇతర పిల్లలకు భిన్నంగా..తన కుమారురడు ఇలా స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలా ఎంతో మంది యువతకు శంకర్ ఆదర్శంగా నిలిచారు. మరి.. ఉదయ్ శంకర్ స్టోరీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.