iDreamPost
android-app
ios-app

రైతులకు గుడ్ న్యూస్.. ఈ సారి ఖాతాల్లోకి రూ.13,500.. ఎలా అంటే?

రైతులకు తీపికబురు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఏడాదికి 6 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఖాతాల్లోకి రూ. 13500 జమకానున్నాయి. ఎలా అంటే?

రైతులకు తీపికబురు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఏడాదికి 6 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఖాతాల్లోకి రూ. 13500 జమకానున్నాయి. ఎలా అంటే?

రైతులకు గుడ్ న్యూస్.. ఈ సారి ఖాతాల్లోకి రూ.13,500.. ఎలా అంటే?

ఆరుగాలం శ్రమించే రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. పంట దిగుబడి సరిగా రాక తెచ్చిన అప్పులు తీరక అప్పుల్లో కూరుకుపోతున్నారు. దుక్కి దున్నింది మొదలు పంట చేతికి వచ్చేంత వరకు పెట్టుబడి తడిసిమోపెడవుతోంది. అకాల వర్షాలు, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ క్రమంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఏడాదికి 6 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతులకు గుడ్ న్యూస్. ఈ సారి రైతుల ఖాతాల్లోకి రూ. 13500 జమకానున్నాయి. ఎలా అంటే?

కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా అర్హులైన రైతులందరికి ఏడాదకి రూ. 6 వేలు అందిస్తోంది. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకొకసారి 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఇప్పటి వరకు 17 విడతలుగా పీఎం కిసాన్ నిధులను పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు 18వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ లో 18వ వాయిదాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

Farmers

కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పంట పెట్టుబడిసాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రూ. 15 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. ఈ వానాకాలం సీజన్ నుంచి ఎకరానికి 7500 చొప్పున రైతులకు అందించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయంతో పాటు పీఎం కిసాన్ కింద రూ. 2 వేలు కూడా అందుకోనున్నారు. అయితే పీఎం కిసాన్ డబ్బులు కొన్ని కారణాల వల్ల పెండింగ్ ఉన్న రైతులకు ఈ కేవైసి పూర్తి చేస్తే గత రెండు విడతల డబ్బులతో పాటు అక్టోబర్ లో వచ్చే 18వ విడత డబ్బులు మొత్తం 6000, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా రూ.7500 కలుపుకుని మొత్తం రూ. 13500 జమకానున్నాయి.