Sabarimala Temple: శబరిమలలో విషాదం.. ఆలయంలో 11 ఏళ్ల చిన్నారి మృతి!

శబరిమలలో విషాదం.. ఆలయంలో 11 ఏళ్ల చిన్నారి మృతి!

Sabarimala Temple : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ బాగా పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో విషాదం చోటుచేసుకుంది.

Sabarimala Temple : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ బాగా పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో విషాదం చోటుచేసుకుంది.

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోయింది. దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు.  ఈ నేపథ్యంలో శబరిమల ఆలయంలో ఓ విషాదం చోటుచేసుకుంది.  స్వామి వారి దర్శనం కోసం  క్యూలైన్ లో వేచి ఉన్న  ఓ 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందింది. ఆ బాలిక తమిళనాడుకు చెందిన భక్తురాలిగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

శనివారం కేరళలోని శబరిమల ఆలయంలో విషాద చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల బాలిక అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లింది. శనివారం క్యూలైన్ లో ఉన్న బాలిక అకస్మాత్తుగా కుప్పకూలి  చనిపోయింది. కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న బాలిక ఇటీవల స్వామి దర్శనం కోసం శబరిమలకు వచ్చింది. చాలా సమయం పాటు భక్తుల రద్దీ మధ్య క్యూలో ఉన్న ఆ బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న ఆలయ అధికారులు ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది.

ఇది ఇలా ఉంటే క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి చూడలేని భక్తులు బారికేడ్ లను దూకేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.దీంతో పవిత్ర మెట్ల దగ్గర రద్దీ ఎక్కువవుతోంది. ఇక ఆలయ దర్శన పరిస్థితి గురించి చూస్తే.. శబరిమల ఆలయానికి ప్రస్తుతం భక్తుల రద్దీ భారీగానే ఉంది. యాత్రికులు స్వామి దర్శానానికి 18 గంటల వరకు వేచి ఉంటున్నారు. దీంతో చాలా మంది భక్తులు స్వామి వారిని త్వరగా దర్శించుకోవాలనే ఆలోచనతో క్యూలైన్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దూకడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

ఈ ఘటనలపై స్పందించిన ఆ  రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి రాధాకృష్ణన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు సీఎస్ ప్రశాంత్ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 10 వేలకు తగ్గించారు. అంతకు ముందు రోజుకు 90 వేలు ఉండగా…దానిని 80 వేలకు కుదించారు. భక్తుల కోసం ప్రత్యేక రెస్క్యూ అంబులెన్స్ సేవ ఏర్పాటు చేస్తున్నట్లు  అధికారులు ప్రకటించారు. భక్తుల మధ్య ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణ వైద్య సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మరి..శబరిమల పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments