iDreamPost
android-app
ios-app

Eesha Rebba: ఈ అమ్మాయికి అవకాశాలు ఇచ్చే అదృష్టం టాలీవుడ్ కి లేదా?

  • Published Nov 30, 2023 | 2:28 PM Updated Updated Nov 30, 2023 | 2:28 PM

తెలుగమ్మాయి ఈషా రెబ్బాకు ఎంతో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందం, అభినయం, నటనలో కూడా మంచి మార్కులు కొట్టేసింది. మరి.. అవకాశాల విషయం వచ్చేసరికి ఈషాకు అన్యాయం జరుగుతోందా?

తెలుగమ్మాయి ఈషా రెబ్బాకు ఎంతో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందం, అభినయం, నటనలో కూడా మంచి మార్కులు కొట్టేసింది. మరి.. అవకాశాల విషయం వచ్చేసరికి ఈషాకు అన్యాయం జరుగుతోందా?

  • Published Nov 30, 2023 | 2:28 PMUpdated Nov 30, 2023 | 2:28 PM
Eesha Rebba: ఈ అమ్మాయికి అవకాశాలు ఇచ్చే అదృష్టం టాలీవుడ్ కి లేదా?

ఈ అమ్మడు.. అందం, అభినయం, టాలెంట్, క్యూట్ నెస్ ఇలా అన్నింటిని సమపాళ్లలో కలిపి తయారు చేసిన పంచదార బొమ్మలా ఉంటుంది. ఆ కళ్లతోనే కుర్రాళ్లను కట్టిపడేయగలదు. చిన్న చిరునవ్వుతో యువత చిరు హృదయాలకు గిలిగింతలు పెట్టగలదు. తన నడకతో నెమలిని సైతం నివ్వెరపోయేలా చేయగలదు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. తమిళ, మలయాళం ఆడియన్స్ ని కూడా మెప్పించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. అయితే ఈ అమ్మడి విషయంలో తెలుగు ఇండస్ట్రీ చేస్తోంది తప్పా?

ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అప్పటి నుంచి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ తన నటనతో సినిమా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకుంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరోయిన్ వంటి పాత్రల్లో కూడా ఈషా నటించింది. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన దయా వెబ్ సిరీస్ కి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. సీజన్ 1లో ఈషా పాత్ర ఒక హౌస్ వైఫ్ గా మాత్రమే చూపించారు. కానీ, సీజన్ 2కి సంబంధించి ఈషా రెబ్బ పాత్ర ఎంతో కీలకం అనే విషయాన్ని రివీల్ చేశారు. ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈషా ఇండస్ట్రీలో ముందుకు వెళ్తూనే ఉంది.

ఇండస్ట్రీ తరఫున ఈషాకు సరైన అవకాశాలు ఇస్తున్నారా? ఆమెకు సముచిత స్థానం కల్పించారా? అనే ప్రశ్నలు కచ్చితంగా వినిపిస్తాయి. ఎందుకంటే ఈషా రెబ్బాకు ఇప్పటికీ స్టార్ హీరోయిన్ అనే పేరు మాత్రం దక్కలేదు. అందం, నటన, గ్లామర్ ఇలా ఎందులోనూ ఈషారెబ్బ.. తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఏ హీరోయిన్ కి తీసిపోదు. కానీ, అవకాశాలు విషయానికి వచ్చే సరికే అసలు సమస్య మొదలవుతోంది. ఇండస్ట్రీలో ఉన్న తెలుగు అమ్మాయిలను కాదని వేరే ఇండస్ట్రీ నుంచి ఎందుకు హీరోయిన్లను తీసుకొస్తున్నారు? అనే ప్రశ్న తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. అందుకు దర్శక నిర్మాతలు చెప్పే సమాధానం మేము అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)

ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ఈషా రెబ్బలాంటి టాలెంటెండ్ హీరోయిన్స్ కి మాత్రం సముచిత స్థానం దక్కడం లేదనే చెప్పాలి. మన పెరట్లో చెట్టు వైద్యానికి పనికిరాదు అన్న సామెత మాదిరి.. తెలుగులో ఉన్న టాలెంటెండ్ హీరోయిన్స్ ని నిర్లక్ష్యం చేస్తూ పక్క ఇండస్ట్రీల నుంచి కాసులు పోసి అరువు తెచ్చుకుంటున్నారు. ఈషా రెబ్బలాంటి తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశం దక్కితే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే తనని తాను నిరూపించుకున్న ఈషా.. తన టైమ్ కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలి? సోషల్ మీడియాలో ఈషాకి ఉన్న క్రేజ్ చూస్తే మతి పోతుంది. నెటిజన్స్ కి అర్థమైన విషయం.. ఇండస్ట్రీకి అర్థం కావడంలేదా? నిజానికి ఈషా రెబ్బాలాంటి తెలుగు అమ్మాయికి అవకాశాలు ఇచ్చే అదృష్టం మన తెలుగు ఇండస్ట్రీకి లేదేమో? మరి.. ఈషాకి సరైన అవకాశాలు రాకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş