iDreamPost
android-app
ios-app

Movie:అమెరికాలో ‘యాత్ర- 2’ క్రేజ్.. జగన్ అభిమానులు భారీ ర్యాలీ!

  • Published Feb 06, 2024 | 2:42 PM Updated Updated Feb 06, 2024 | 4:57 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎదిగిన తీరును ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా యాత్ర 2. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అమెరికాలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఎందుకంటే..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎదిగిన తీరును ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా యాత్ర 2. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అమెరికాలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఎందుకంటే..

  • Published Feb 06, 2024 | 2:42 PMUpdated Feb 06, 2024 | 4:57 PM
Movie:అమెరికాలో ‘యాత్ర- 2’ క్రేజ్.. జగన్ అభిమానులు భారీ ర్యాలీ!

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. పొలిటికల్‌ డ్రామాగా 2019 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా ‘యాత్ర- 2’ తెరకెక్కనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని తెరపై చూపించనున్నారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రను తమిళ్ నటుడు జీవా నటిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదిగిన తీరు.. 2009 నుంచి 2019 వరకు ఏపీ రాజకీయలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రూపొందించినదే ఈ యాత్ర2. ఇదిలా ఉంటే.. తాజాగా యాత్ర సినిమాకు సంబంధించి అమెరికాలోని భారీ ర్యాలీని నిర్వహించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులు జీవితాలపై ఎన్నో బయోపిక్ లు వచ్చినా.. అవి అంతగా ప్రేక్షకుల్లో హృదయాల్లో నిలిచేలా క్రేజ్ ని తీసుకురాలేదు. కానీ, యాత్ర సినిమాకు మాత్రం భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన కారణం. ఎందుకంటే దేశంలో అత్యంత ప్రజాదరణ ముఖ్యమంత్రుల్లో జగన్ మోహన్ రెడ్డి కూడా ఒకరు. ఈయనకు రాష్ట్రంలోనూ, దేశంలోనూ అభిమానులు ఉండటం విశేషం. కానీ, ప్రపంచ దేశాల్లో కూడా వీరాభిమానులు ఉండటం ఆశ్చర్యం. తాజాగా యాత్ర- 2 సినిమా విడుదల సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న వైఎస్సార్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహిచారు. అందుకుగాను కొన్ని వందల కార్లు, బైకులతో యాత్ర పోస్టర్స్ పట్టుకుని రోడ్ షో చేశారు. అమెరికాలో ఈ సినిమా విడుదలకు ముందే యాత్ర జెండా రెపరెపలాడుతుంది. ఈ సినిమా విడుదల కోసం వైఎస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అమెరికాలోని టెక్సాస్, డల్లాస్ లో ఫిబ్రవరి 7వ తేదిన యాత్ర -2 ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ నిర్వహించనున్నారు. అలాగే ఫిబ్రవరి 7 నుంచే అమెరికాలో ప్రీమియర్ షోలు ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అలాగే యాత్ర-2 సినిమా  తెలుగు రాష్ట్రల్లో ఫిబ్రవరి 8వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, ఈ మూవీ సెల్యులాయిడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక దీనికి  సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల్లో, వైఎస్ అభిమానుల్లో భారీ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి. మరి, అమెరికాలో వైఎస్ అభిమానులు చేసిన ర్యాలీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişanadolucasino girişgrandpashabet