Yash : సోషల్ మీడియాలో రాఖీ భాయ్ మీద దాడి

ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న కెజిఎఫ్ 2 మీద విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధానికి తెరతీశారు. ఒక రోజు ముందు విజయ్ బీస్ట్ రిలీజవుతున్న నేపథ్యంలో తమదే ఆధిపత్యం ఉండాలన్న ధోరణి చూపిస్తుండటం పరస్పరం ఆన్ లైన్ గొడవలకు తెరతీసేలా కనిపిస్తోంది. నిజానికి తనకు, సీనియర్ మోస్ట్ స్టార్ హీరో అయిన విజయ్ కు పోలిక లేదని, ఆయన్ను ఎప్పటికీ గౌరవిస్తానని యష్ పబ్లిక్ గ్గానే చెప్పాడు. పైగా రెండు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు. నిన్న బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కెజిఎఫ్ ట్రైలర్ ని అభినందిస్తూ ప్రత్యేకంగా ట్వీట్ చేయడం మరో ట్విస్ట్.

ఇదంతా బాగానే ఉంది కానీ కొందరు ఫ్యాన్స్ ఈ క్లాష్ ని టూ మచ్ పర్సనల్ గా తీసుకోవడం బాలేదు. నిజానికి ఈ డేట్ ని ఆరు నెలల క్రితమే కెజిఎఫ్ 2 లాక్ చేసుకుంది. ఆ కారణంగానే ఇతర ప్యాన్ ఇండియా సినిమాలు తమ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నాయి. ఉన్నట్టుండి సడన్ గా ఊడిపడింది బీస్టే. అయినా కూడా యష్ ని ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. విజయ్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ కి మరో కారణం ఉంది. బీస్ట్ నిర్మాణ సంస్థ ఇప్పటిదాకా సరైన ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ట్రైలర్ సంగతి దేవుడెరుగు ఇంకా టీజరే లేదు. ఇవాళ రేపు అంటూ మీనమేషాలు లెక్కబెడుతున్నారు. ఇంత నెమ్మదిగా ఉండటం అభిమానులకు మింగుడు పడటం లేదు.

ప్రాక్టికల్ గా చూస్తే తమిళనాడు కేరళ మినహాయించి ఇతర భాషల్లో బీస్ట్ కన్నాకెజిఎఫ్ 2కే హైప్ ఎక్కువగా ఉంది. ఒకవేళ బీస్ట్ కు యావరేజ్ టాక్ వచ్చినా రాఖీ భాయ్ ప్రభంజనం ముందు అది నిలవడం కష్టం. యష్ మూవీ ట్రైలర్ అంచనాలకు తగ్గట్టే ఉండటంతో బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. బడ్జెట్ పరంగా దాంతో పోల్చి చూస్తే బీస్ట్ సగం కూడా సరితూగదు. అలాంటప్పుడు ఈ కంపేరిజన్లు అనవసరం. అయినా యష్ ఇంకా అప్ కమింగ్ స్టేజిలోనే ఉన్నాడు. కెజిఎఫ్ తననేమి రజనీకాంత్ ను చేయలేదు. ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. కానీ క్లాష్ పేరుతో విజయ్ ఫ్యాన్స్ ఇలా మాటల దాడులకు తెగబడటమే బాలేదు

Also Read : Alia Bhatt : ట్రిపులార్ సీతకు కోపం వచ్చిందా

Show comments