iDreamPost
android-app
ios-app

విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన దళపతి విజయ్- థమన్!

  • Published Aug 27, 2024 | 6:28 PM Updated Updated Aug 27, 2024 | 6:28 PM

Vijay: కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తెర మీదే కాదు.. బయట కూడా రియల్ హీరోనే అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సాయం చేసి తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. ప్రస్తుతం ఆ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Vijay: కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తెర మీదే కాదు.. బయట కూడా రియల్ హీరోనే అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సాయం చేసి తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. ప్రస్తుతం ఆ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.

  • Published Aug 27, 2024 | 6:28 PMUpdated Aug 27, 2024 | 6:28 PM
విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన దళపతి విజయ్- థమన్!

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ఎప్పటి నుండి సామాజిక కార్యక్రమాలు చేపడుతూ సినిమాలోనే కాదు బయట కూడా రియల్ హీరోనే అనిపించుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఉచిత ఆహారం, నిరుపేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించడం, ట్యూషన్స్ చెప్పించడం, న్యాయ సహాయం అందించడం వంటి స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మాస్తుంటారు. తాజాగా తమిళగ వెట్రి కళగం పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు జెండాను ఆవిష్కరించాడు. ఇటు సినిమాలు చేస్తూనే అటు రాజకీయంగానూ.. ఇలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థికి ఆర్థిక సాయం అందించారు

తమిళనాడులోని కోవిల్ పట్టికి చెందిన ఓ స్టూడెంట్ కూలి పనులు చేస్తూ కాలేజీలో చదువుకుంటున్నాడు. రోజు మూటలు మోస్తూ, పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ.. చదువుకునేందుకు కిలో మీటర్లు నడిచి కాలేజీకి వెళ్లేవాడట. 5 గంటలు మూటలు మోస్తూ తండ్రికి సాయం చేస్తున్నానని, అలాగే మూడు కిలో మీటర్లు నడిచి కాలేజీకి వెళుతున్నట్లు ఓ టీవీ ఛానల్లో చెప్పాడు సదరు స్టూడెంట్. ఈ విషయం విజయ్ దృష్టికి చేరింది. వెంటనే విద్యార్థికి అండగా నిలబడటంతో పాటు కుటుంబానికి ఆసరాగా నిలిచాడు ఇళయదళపతి. విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చు రూ. 25 వేలు అందించడంతో పాటు నిత్యావసర సరకులు ఇచ్చారు. విజయ్‪కు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదని తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

విద్యార్థి వీడియోపై థమన్ కూడా స్పందించారు. ఆ విద్యార్థికి టూ వీలర్ కొనిస్తానని హామీనిచ్చారు. కాగా, ఇళయ దళపతి సాయం చేయడంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దట్ ఈజ్ దళపతి అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. హీ ఈజ్ ఏ రియల్ హీరో అని, గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. విజయ్, థమన్‌లను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే..  ది గోట్ మూవీతో రాబోతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. సుమారు 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది.  తన చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి రాజకీయాల్లోకి షిఫ్ట్ కానున్నాడు ఈ కోలీవుడ్ స్టార్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom