iDreamPost
android-app
ios-app

కెప్టెన్ విజయ్‌కాంత్ ఇంట ‘ది గోట్’ టీమ్.. ఎందుకో తెలుసా?

  • Published Aug 20, 2024 | 10:02 AM Updated Updated Aug 20, 2024 | 10:02 AM

The Goat Movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ ది గోట్ ( దిగ్రైటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). తాజాగా ది గోట్ టీమ్ దివంగత నటుడు విజయ్‌కాంత్ ఇంటికి వెళ్లారు.. ఎందుకో తెలుసా?

The Goat Movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ ది గోట్ ( దిగ్రైటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). తాజాగా ది గోట్ టీమ్ దివంగత నటుడు విజయ్‌కాంత్ ఇంటికి వెళ్లారు.. ఎందుకో తెలుసా?

  • Published Aug 20, 2024 | 10:02 AMUpdated Aug 20, 2024 | 10:02 AM
కెప్టెన్ విజయ్‌కాంత్ ఇంట ‘ది గోట్’ టీమ్.. ఎందుకో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. అలాంటి వారిలో దళపతి విజయ్ ఒకరు. ప్రముఖ దర్శక, నిర్మాత ఎస్ ఎ చంద్రశేఖర్ తనయుడు. తండ్రి దర్శకత్వంలో ‘వెట్రి’(1984), ఇతు ఎంగల్ నీతి(1988) మూవీస్ లో బాలనటుడిగా నటించాడు. ‘నాలాయ తీర్పు’ మూవీతో హీరోగా మారాడు. ఇటీవల విజయ్ నటిస్తున్న మూవీస్ బాక్సాఫీస్ హిట్స్ గా నిలుస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.  ది గోట్ టీమ్ దివంగత కెప్టెన్ విజయ్ కాంత్ ఇంటికి వెళ్లారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రముఖ దర్శకులు వెంకట్ ప్రభుత్వ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్’ (ది గోట్). ఈ మూవీలో ఏఐ సాయంతో దివంగత నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ ని చూపించబోతున్నారు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం ది గోట్ మూవీ ప్రమోషన్లు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే విజయ్, వెంకట్ తదితరులు కెప్టెన్ విజయ్ కాంత్ ఇంటికి వెళ్లారు. ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. విజయ్ కాంత్ సతీమణి, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతతో కాసేపు మట్లాడారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రభు, ప్రేమలత సోషల్ మీడియాలో ‘కెప్టెన్ ఆశీర్వాదం తీసుకున్నాం’ అంటూ సంబంధిత ఫోటో షేర్ చేశారు.

GOAT movie team at vijayanth house

విజయ్‌కాంత్ రూపాన్ని తన సినిమాలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న డైరెక్టర్.. అనుమతి కోసం పలు మార్లు విజ్ఞప్తి చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రేమలత. విజయ్, ఆయన తండ్రి ఎస్ ఎ చంద్రశేఖర్ అంటే విజయక్‌కాంత్ కు ఎంతో అభిమానం. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ కోసం ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీ వినియోగించారు. దీని సాయంతో విజయ్ ని కుర్రాడిలా చూపించే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.