iDreamPost
android-app
ios-app

Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ మరో శ్రీలీల అవుతుందా?

  • Published Aug 06, 2024 | 1:09 PM Updated Updated Aug 06, 2024 | 1:09 PM

'భాగ్యశ్రీ బోర్సే'.. రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

'భాగ్యశ్రీ బోర్సే'.. రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

  • Published Aug 06, 2024 | 1:09 PMUpdated Aug 06, 2024 | 1:09 PM
Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ మరో శ్రీలీల అవుతుందా?

చెరువులోకి పాత నీరు పోయి.. కొత్త నీరు ఎలా వస్తుంటుందో.. అలాగే ఇండస్ట్రీలోకి కొత్త కొత్త నటీ, నటులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొంత మంది మాత్రం ఒకే ఒక్క మూవీతో పరిశ్రమను తమవైపు తిప్పుకుంటారు. ప్రస్తుతం ఓ బ్యూటీ ఇదే కోవలోకి వచ్చింది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే వరుసగా అవకాశాలు కొట్టేస్తోంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. ‘భాగ్యశ్రీ బోర్సే’. రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇక టాలీవుడ్ లో మరో శ్రీలీల అవుతుందా? అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సినీ లవర్స్.

భాగ్యశ్రీ బోర్సే.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తున్న భామ. మిస్టర్ బచ్చన్ మూవీతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన బోర్సే అందరి దృష్టిని తనవైపు లాక్కుంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటల్లో కూడా భాగ్యశ్రీ తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. డ్యాన్స్ తో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. బోర్సే అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకుండానే కంటిన్యూస్ గా ఛాన్స్ లు కొట్టేస్తోంది ఈ బ్యూటీ.

ఇప్పటికే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ మూవీలో అవకాశాలు దక్కించుకుంది బోర్సే. దాంతో టాలీవుడ్ కు బోర్సే మరో శ్రీలీల అవుతుందా? అన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సినీ లవర్స్. ఎందుకంటే? ఒక్క సినిమాతో పాపులర్ అయ్యి.. వరుసగా ఆఫర్లు దక్కించున్న హీరోయిన్లు లేరనే చెప్పాలి. పెళ్లిసందడి రిలీజ్ తర్వాత శ్రీలీలకు అరడజనుకు పైగా సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. ఇప్పుడు బోర్సేకు కూడా ఇలాగే ఛాన్స్ లు వచ్చిపడుతున్నాయి. కృతిశెట్టి కూడా ఈ జాబితాకు చెందిన హీరోయినే. ఆమెకు కూడా ఉప్పెన తర్వాత కంటిన్యూస్ గా సినిమా ఛాన్స్ లు వచ్చాయి. భవిష్యత్ లో ఇంకెన్నీ మూవీ ఛాన్స్ లు  దక్కించుకుంటుందో చూడాలి. మరి మిస్టర్ బచ్చన్ బ్యూటీ టాలీవుడ్ లో మరో శ్రీలీలగా మారబోతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş