Karthikeya 3: కార్తికేయ 3.. కోట్లు కుమ్మరించే ఓ గోల్డెన్ ప్రాజెక్ట్! అల్లు అరవింద్ యాడ్ అవుతారా?

కార్తికేయ 2 సినిమాకు నేషనల్ అవార్డు రావడం.. కార్తికేయ 3 కచ్చితంగా ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నిర్మాణంలోకి అల్లు అరవింద్ యాడ్ అవుతారా? అన్న చర్చ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

కార్తికేయ 2 సినిమాకు నేషనల్ అవార్డు రావడం.. కార్తికేయ 3 కచ్చితంగా ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నిర్మాణంలోకి అల్లు అరవింద్ యాడ్ అవుతారా? అన్న చర్చ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

కార్తికేయ 2.. ఇటీవల ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్రాల అవార్డుల్లో తెలుగు విభాగంలో అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కృష్ణతత్వం నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఇక తాజాగా నేషనల్ అవార్డు రావడంతో.. మూవీ మేకర్స్ అభిషేక్ అగర్వాల్, పీపుల్ మీడియా సంస్థల అధినేతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల తమ సంతోషాన్ని తెలియజేస్తూ.. కార్తికేయ 3 కచ్చితంగా ఉంటుంది వెల్లడించారు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ గోల్డెన్ ప్రాజెక్ట్ లోకి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ యాడ్ అవుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కార్తికేయ 2కు నేషనల్ అవార్డు రావడం.. కార్తికేయ 3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో ఇప్పుడు చర్చంతా ఈ సినిమా గురించే నడుస్తోంది. చందు మెుండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పార్ట్ 3కి సంబంధించిన క్రేజీ ప్రాజెక్ట్ లోకి అల్లు అరవింద్ యాడ్ అవుతారన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణాలు లేకపోలేదు. గీతా ఆర్ట్స్ కు, చందు మెుండేటికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా ప్రస్తుతం నాగ చైతన్యతో చేసే ‘తండేల్’ మూవీని కూడా అల్లు అరవిందే నిర్మిస్తున్నారు. ఈ స్నేహం కారణంగా కార్తికేయ 3 లాంటి గోల్డెన్ ప్రాజెక్ట్ లోకి అరవింద్ వస్తారని అందరూ అనుకుంటున్నారు.

అదీకాక గతంలో కార్తికేయ 2కు వచ్చిన కొన్ని సమస్యలను వెనక నుంచి క్లియర్ చేసింది గీతా ఆర్ట్స్ అని చాలా మంది చెప్పుకున్నారు. ఇక పొలిమేర 3 మూవీని కూడా తెరకెక్కించే పని పెట్టుకుంది గీతా ఆర్ట్స్. ఈ అన్ని విషయాలను పరిగణంలోకి తీసుకుంటే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోకి అరవింద్ వస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ లు అరవింద్ వస్తానంటే  ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. పార్ట్ 2 కు నేషనల్ అవార్డ్ రావడంతో.. పార్ట్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో కోట్లు కుమ్మరించే గోల్డెన్ ప్రాజెక్ట్ లో గీతా ఆర్ట్స్ ను చేర్చుకుంటారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాగా.. ఇలాంటి క్యూరియాసిటి ఉన్న ప్రాజెక్ట్ లోకి అరవింద్ లాంటి ప్రొడ్యూసర్ వస్తే.. దాని రేంజ్ మరో లెవల్ కు వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంపై చర్చలు నడుస్తున్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్. మరి కార్తికేయ 3లో అల్లు అరవింద్ భాగం అవుతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments