iDreamPost
android-app
ios-app

పరారీలో హర్ష సాయి.. అక్కడే ఉన్నట్లు సమాచారం!

  • Published Sep 26, 2024 | 10:49 AM Updated Updated Sep 26, 2024 | 10:49 AM

Harsha Sai: ఇప్పటికే హర్ష సాయిపై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడంతో అతని పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కానీ, హర్ష సాయి నిన్నటి నుంచి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హర్ష సాయి ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది.

Harsha Sai: ఇప్పటికే హర్ష సాయిపై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడంతో అతని పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కానీ, హర్ష సాయి నిన్నటి నుంచి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హర్ష సాయి ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది.

  • Published Sep 26, 2024 | 10:49 AMUpdated Sep 26, 2024 | 10:49 AM
పరారీలో హర్ష సాయి.. అక్కడే ఉన్నట్లు సమాచారం!

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై ఇటీవలే లైంగిక ఆరోపణలతో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమే కాకుండా.. ఆమెపై అత్యాచారం చేసి, వీడియోలు, ఫోటోలను రికార్డు చేశాడని ఓ నటి ఆరోపణలను చేసింది. అంతేకాకుండా.. తన వద్ద రూ. 2 కోట్లు తీసుకన్నాడని, తీరా పెళ్లి చేసుకోమంటే న్యూడ్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నార్సింగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక ఆ ఫిర్యాదులో హర్ష సాయి తో పాటు ఆయన తండ్రి పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయి పై నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసు నమోదు చేసారు. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేసుకున్నారు. కానీ, హర్ష సాయి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హర్ష సాయి ఓ ప్రాంతంలో తలదాచుకున్నాడంటూ సమాచారం వినిపిస్తోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే హర్ష సాయి బాధితురాలకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిని అదుపులో తీసుకొని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవతుండగా.. హర్ష సాయి మాత్రం నిన్నటి నుంచి పరారీలో ఉన్నాడు. కానీ, తాజాగా హర్ష సాయి ముంబాయిలో ఉన్నాడంటూ సమాచారం వినిపిస్తుంది. ఈ క్రమంలోనే హర్ష సాయికి సంబంధించి ఆధారలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే హర్ష సాయి కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా గాలింపు చేపట్టానున్నారు.మరోవైపు హర్ష సాయి చెన్నైలో ఉన్నాడనే టాక్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. కానీ, ఇందులో ఏదీ నిజం, ఏదీ పుకారు అనేది మాత్రం తెలియడం లేదు. అసలు ఇంతకీ హర్ష సాయి ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు.

కానీ, నిన్న మాత్రం తనపై వచ్చిన లైంగిక ఆరోపణాలకు గాను హర్ష సాయి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ స్పందించాడు. కేవలం డబ్బుల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. నా లాయర్ అంతా చూసుకుంటారని పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఇక హర్ష సాయి లాయర్ చిరంజీవి కూడా హర్ష సాయి ఏ తప్పు చేయలేదని, తనని పెళ్లి చేసుకోమని ఆ యువతి వేధిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. మరి, ఏదీ ఏమైనా హర్ష సాయి బయటకి వచ్చి ఈ విషయం పై స్పందించి మాట్లాడితే తప్ప నిజ, నిజాలు వెలుగులోకి రావు. అయితే మరోవైపు హర్ష సాయి ఏ తప్పు చేయనప్పుడు పరారీలో ఉండటం ఎందుకు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి నిజాలు బయటపెడితే సరి కదా అంటూ నెటిజన్స్, ఆయన ఫ్యాన్స్ నెట్టింట చర్చించుకుంటున్నారు. మరి, హర్ష సాయి ముంబయిలో ఉన్నాడంటూ టాక్ వినిపిస్తుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş