iDreamPost
android-app
ios-app

పెదకాపు.. దర్శకుడే విలన్! అసలు కారణం ఇదేనట!

  • Author ajaykrishna Updated - 01:36 PM, Tue - 12 September 23
  • Author ajaykrishna Updated - 01:36 PM, Tue - 12 September 23
పెదకాపు.. దర్శకుడే విలన్! అసలు కారణం ఇదేనట!

దర్శకులు నటులుగా మారడం ఇండస్ట్రీలో కొత్త కాదు. ఫుల్ లెంత్ రోల్స్ లో కాకపోయినా.. కనీసం చిన్న రోల్స్, గెస్ట్ అప్పియరెన్స్ లో అయినా మెరుస్తుంటారు. కానీ.. దర్శకుడు నటుడిగా మారి.. అందులోనూ పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ లో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే.. ఇన్నాళ్లు క్లాస్ డైరెక్టర్ అనిపించుకున్న వ్యక్తి.. సడన్ గా మాస్ అవతారం ఎత్తితే ప్రేక్షకులు ఖచ్చితంగా షాక్ అవుతారు. ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను పెదకాపు ట్రైలర్ లో విలన్ గా చూసి అలాంటి షాక్ లోనే ఉన్నారు ఆడియన్స్. కొత్తబంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద లాంటి క్లాస్ సినిమాలు తీసి క్లాస్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.

అదే శ్రీకాంత్ అడ్డాల.. వెంకటేష్ తో నారప్ప.. అసురన్ రీమేక్ చేసి మాస్ టేకింగ్ తో భేష్ అనిపించాడు. ఇప్పుడు పెదకాపు సినిమాలో డైరెక్ట్ విలన్ పాత్రతో సర్ప్రైజ్ చేసేసాడు. శ్రీకాంత్ అడ్డాల డైలాగ్స్, సీరియస్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కానీ.. ఆయన ఎందుకు నటుడిగా మారాల్సి వచ్చింది అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పెదకాపు మూవీ.. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్‌ నేపథ్యంతో రెండు భాగాలుగా రాబోతుందట. సెప్టెంబర్ 29న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల జానర్ కి, సినిమాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కింది. రా అండ్ రస్టిక్ నేపథ్యంలో సినిమా ఆసక్తి రేపుతోంది.

ఇక శ్రీకాంత్ అడ్డాల ఎందుకు విలన్ రోల్ లో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది? అనే విషయంపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను మొదట ఆ పాత్ర కోసం మలయాళ నటుడు శౌబిన్ షహిర్‌ ను ఓకే చేశాను. ఆయన కూడా ఆ పాత్ర చేయడానికి రెడీ అయ్యారు. తీరా షూటింగ్ కి వెళ్ళాక ఆయన కనిపించలేదు. ఏమైందో తెలియదు. అప్పటికప్పుడు ఆర్టిస్ట్ లను తీసుకురావడం కష్టం. అప్పటికే షూటింగ్ ఏర్పాట్లు అన్ని అయిపోయాయి. సో.. నా అసోసియేట్ డైరెక్టర్ కిషోర్ నన్నే ఆ క్యారెక్టర్ చేయమని అడిగాడు” అని శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. ప్రస్తుతం పెదకాపు ట్రైలర్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి శ్రీకాంత్ అడ్డాల మాస్ ట్రాన్స్ ఫర్మేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetcasibomholiganbetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet