సాధారణంగా ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ మూవీ వస్తుందంటే అంచనాలు ఎలాగైనా ఏర్పడతాయి. కాకపోతే ముందు పార్ట్ లో నటించిన స్టార్స్ నే ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. కానీ.. ఒక్కోసారి ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా సీక్వెల్స్ వస్తుంటాయి. మొదట పార్ట్ లో కనిపించిన స్టార్స్ ఎవరూ లేకుండా.. పూర్తిగా డిఫరెంట్ కాస్ట్ తో సీక్వెల్స్ తీస్తుంటారు. ఇప్పుడు అదే బాటలో తెరకెక్కింది బ్లాక్ బస్టర్ చంద్రముఖి 2. దాదాపు పదిహేడేళ్ల క్రితం.. సూపర్ స్టార్ రజినీ హీరోగా, జ్యోతిక, నయనతార హీరోయిన్స్ గా వచ్చింది చంద్రముఖి. దర్శకుడు పి. వాసు రూపొందించిన ఈ సినిమా.. హారర్ కామెడీ జానర్ లో.. ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది.
అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే.. ఎవరైనా అదే కాస్ట్ అండ్ క్రూని ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ.. ఈసారి సీక్వెల్ లో డైరెక్టర్ తప్ప మిగతా కాస్ట్ అంతా మార్చేశారు. చంద్రముఖి.. మలయాళం మణిచిత్రరాజు మూవీకి రీమేక్ అయినప్పటికీ.. సూపర్ స్టార్ స్వాగ్, స్టైల్.. ఇంటరెస్టింగ్ కథాకథనాలు, సాంగ్స్ తో అద్భుతమైన విజయం సాధించింది. అందులో నటనకు గాను జ్యోతికకు ఊహించని రేంజ్ లో క్రేజ్ లభించింది. సూపర్ స్టార్ రజినీ ఒక హారర్ సినిమా చేయడం అప్పట్లో ఓ సంచలనం. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్.. చంద్రముఖి 2.. లారెన్స్ హీరోగా రూపొందింది. పి. వాసునే తెరకెక్కించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషలలో రిలీజ్ అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. ఎంఎం కీరవాణి అందించిన పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో అసలు సూపర్ స్టార్ రజినీ నటించిన చంద్రముఖి సీక్వెల్ లో ఆయన ప్లేస్ లో హీరోగా లారెన్స్ ఎలా వచ్చాడు? హీరోని ఎందుకు మార్చారు? అనే డౌట్ అందరిలో నెలకొంది. దానికి సమాధానం రీసెంట్ గా డైరెక్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపారు. అదేంటంటే.. చంద్రముఖి సీక్వాల్ కథను ముందుగా రజినీకే వినిపించడం జరిగిందట. కానీ.. కథ విన్నాక దీనికి లారెన్స్ అయితే బాగుంటుందని రజినీ సూచించారట. అందుకే రజినీ ప్లేస్ లో లారెన్స్ వచ్చాడని చెప్పారు పి. వాసు. ఇక ఈ సీక్వెల్ లో చంద్రముఖిగా కంగనా రనౌత్ నటించింది. మరి చంద్రముఖి 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.