iDreamPost
android-app
ios-app

లియో – కేసరి – టైగర్.. దసరా విన్నర్ ఎవరు?

  • Author ajaykrishna Published - 11:37 AM, Sat - 21 October 23

ఈ మూడు సినిమాలు పోటీపడి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి. ఇందులో మళ్ళీ రెండు పాన్ ఇండియా స్థాయిలో బరిలోకి దిగాయి. భగవంత్ కేసరి తెలుగు వరకే పరిమితం కాగా.. టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

ఈ మూడు సినిమాలు పోటీపడి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి. ఇందులో మళ్ళీ రెండు పాన్ ఇండియా స్థాయిలో బరిలోకి దిగాయి. భగవంత్ కేసరి తెలుగు వరకే పరిమితం కాగా.. టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

  • Author ajaykrishna Published - 11:37 AM, Sat - 21 October 23
లియో – కేసరి – టైగర్.. దసరా విన్నర్ ఎవరు?

2023.. దసరా వచ్చేసింది. పండుగకు బాక్సాఫీస్ జోరు కూడా మొదలైంది. ముచ్చటగా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రెండు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కాగా ఇంకోటి తమిళ డబ్బింగ్. అవేవో అర్థమైందిగా.. బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో. ఈ మూడు సినిమాలు పోటీపడి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి. ఇందులో మళ్ళీ రెండు పాన్ ఇండియా స్థాయిలో బరిలోకి దిగాయి. భగవంత్ కేసరి తెలుగు వరకే పరిమితం కాగా.. టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అటు రవితేజకు, ఇటు విజయ్ కి ఫస్ట్ పాన్ ఇండియా రిలీజులుగా ఇవి నిలిచాయి.

ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మూడు సినిమాలు డిఫరెంట్ గా బజ్ క్రియేట్ చేసుకున్నాయి. కానీ.. పెర్ఫార్మన్స్ పరంగా సత్తా చాటినవి మనకు ముఖ్యం. ఒక్కో సినిమా ఒక్కో మోటివ్ తో ఆడియన్స్ ముందుకొచ్చాయి. లియో మూవీ.. లోకేష్ కనగరాజ్ కారణంగా సూపర్ బజ్ క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే.. ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేష్ సిద్ధం చేసిన LCU నే అందుకు కారణం. లియోని ఎలా LCU లో కలిపాడు. ఎక్కడ లింక్ చేశాడు? లియోకి ఖైదీ, విక్రమ్ లతో పోరు ఎలా ఉంటుంది? అనేది మెయిన్ ఇంటరెస్టింగ్ పాయింట్. లియో సినిమాకు ప్రేక్షకులు రావడానికి మోటివ్ ఇదే. వెరసి.. సినిమా ఫస్ట్ డే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్. గతంలో ఏ తమిళ హీరో కూడా రూ. 130 కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టలేదు. కానీ.. వందకోట్ల రికార్డులు సూపర్ స్టార్ రజినీ ఎప్పుడో నమోదు చేశాడు. టాలీవుడ్ లో లియో పరిస్థితి అటు ఇటుగా ఉంది. కొన్ని అంశాలు బాగున్నప్పటికి.. మాక్సిమం నిరాశ పరిచిన టాక్ నడుస్తుంది. ఇక టైగర్ నాగేశ్వరరావు.. రవితేజ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అనే టాక్ ఉంది. కానీ.. ఇదికూడా పూర్తి స్థాయిలో అంచనాలు రియాక్ట్ కాలేదని ఆడియన్స్ నుండి రెస్పాన్స్ వస్తోంది. బట్.. ఎంచుకున్న సబ్జెక్టు బాగుంది. కలెక్షన్స్ పరంగా సినిమా రికార్డులు తిరగరాస్తుందా అనంటే.. అది వేరే సంగతి. ఆడియన్స్ కి సంతృప్తినిచ్చిందా లేదా అన్నదే పాయింట్.

ఇక ముచ్చటగా మూడో సినిమా భగవంత్ కేసరి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ పై ముందునుండి కొన్ని అంచనాలున్నాయి. ఎందుకంటే.. రెగ్యులర్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో అలరించే డైరెక్టర్, పక్కా మాస్ ఆడియన్స్ ని మెప్పించే బాలయ్య కాంబో అంటే.. డిఫరెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. వీళ్ళు నిజంగానే శ్రీలీల, కాజల్ లాంటి బ్యూటీలను పెట్టి డిఫరెంట్ సబ్జెక్టు ట్రై చేశారు. ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ కూడా బాగుంది. అయితే.. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే.. టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి సినిమాలకంటే లియో కాస్త వెనకబడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. డబ్బింగ్ సినిమా అయినా ఆదరించేందుకు రెడీగా ఉన్నా.. సబ్జెక్టులో లింక్స్ సరిగ్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని టాక్ ఉంది. మరి అసలు దసరా విన్నర్ ఎవరంటే.. వేటికవే విన్నర్స్.. బట్ ఓరల్ గా టాలీవుడ్ లో తెలుగు సినిమాలే నెగ్గాయి అనేది ప్రేక్షకుల సమాధానం. మరి ఈ మూడు సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

  • Also Read: