iDreamPost
android-app
ios-app

లావణ్యతో చెప్పు దెబ్బతిన్న వ్యక్తి ఎవరు? అతని బ్యాగ్రౌండ్‌ ఏంటంటే?

  • Published Aug 02, 2024 | 11:57 AM Updated Updated Aug 02, 2024 | 1:17 PM

ఇటీవలే లావణ్య రాజ్ తరుణ్ వివాదంలో జరిగిన లైవ్ డిబెట్ లో.. లావణ్య చెప్పుతో కొట్టిన వ్యక్తి ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటి? రాజ్ తరుణ్ కి, శేఖర్ బాషా మధ్య సంబంధం ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే లావణ్య రాజ్ తరుణ్ వివాదంలో జరిగిన లైవ్ డిబెట్ లో.. లావణ్య చెప్పుతో కొట్టిన వ్యక్తి ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటి? రాజ్ తరుణ్ కి, శేఖర్ బాషా మధ్య సంబంధం ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 02, 2024 | 11:57 AMUpdated Aug 02, 2024 | 1:17 PM
లావణ్యతో చెప్పు దెబ్బతిన్న వ్యక్తి ఎవరు? అతని బ్యాగ్రౌండ్‌ ఏంటంటే?

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకోక ఎపిసోడ్ తో కొత్త మలుపు తిరిగుతుంది. ఇప్పటికే వీరి వివాదం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుని మోసం చేశాడని, అబార్షన్ కూడా చేశాడని లావణ్య పలు ఆరోపణలు చేస్తూ.. ఎక్కడపడిత అక్కడ వాదనలు చేస్తోంది. అంతేకాకుండా.. ఈ విషయం పై రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మాల్హోత్రా పై పోలీసులు స్టేషన్ లో కేసులు కూడా పెట్టిన విషయం తెలిసిందే.ఇక ఈ విషయం పై స్పందించిన రాజ్ తరుణ్.. లావణ్య అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుందని, తాను చేసే ఆరోపణలు నిజం కావాని తనవద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని తాజాగా తిరగబడరాసామి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. అలాగే ఆధారాలన్ని తీసుకువచ్చి కోర్టులో ఫైట్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. లావణ్య రాజ్ తరుణ్ వివాదంలోకి కొత్తగా శేఖర్ బాషా ఎంటర్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి మధ్య లైవ్ డిబెట్ జరిగింది. ఇక ఈ డిబెట్ లో ఒకరిపై ఒకరు పరస్పరంగా ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శేఖర్ బాషా చిన్న పిల్లలకు సైతం లావణ్య మాదకద్రవ్యాలు అలవాటు చేసిందంటూ ఆరోపణలు చేశాడు. దీంతో సహనం కోల్పోయిన లావణ్య ఆగ్రహంతో వెంటనే.. శేఖర్ బాషా పై చెప్పు విసిరి కొట్టింది. ఇక శేఖర్ బాషా కూడా రియాక్ట్ అయ్యి లావణ్య మీదకు దూసుకెళ్లాడు. కానీ, ఇంతలోనే ఛానల్ వాళ్లు అడ్డుపడుతూ శేఖర్ బాషాను అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఇంతకీ లావణ్య చెప్పుతో కొట్టిన ఈ శేఖర్ బాషా ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటి? రాజ్ తరుణ్ కి, శేఖర్ బాషా మధ్య సంబంధం ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే జరిగిన లైవ్ డిబెట్ లో లావణ్య చెప్పుతో కొట్టిన వ్యక్తి  అసలు పేరు ‘గుదిమెళ్ల రాజశేఖర్’ అలియాస్ శేఖర్ బాషా. అయితే ఈయన మొదటిగా 2005లో జెమినీ మ్యూజిక్ వీడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ‘హాయ్ బుజ్జి’, పిల్లల థీమ్ ఆధారత టీవీ ప్రొగ్రామ్స్ తో మొత్తం 3000 ఛానెల్ లకు కంటే ఎక్కువ లైవ్ షోలో పాల్గొన్నాడు. దీని తర్వాత రెడీయో జాకీగా మారి అక్కడ కూడా పలు షోలను నిర్వహించి పలు  అవార్డులను కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే.. మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ బాషా.. ‘వెల్‌కమ్ ఒబామా’ అనే చిత్రంతో నటుడిగా వెండితెర పై కూడా రంగప్రవేశం చేశాడు. ఆ తర్వాత ‘వేతిక నేను నా ఇష్టంగా’ అనే సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు అలాగే 2014లో విడుదలైన చల్లా భాను కిరణ్ దర్శకత్వం వహించిన ‘పంచముఖి’ చిత్రంతో అతను దర్శకుడిగా నటించాడు.

అయితే ఇలా రేడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టిన శేఖర్ బాషా టెలివిజన్ వ్యాఖ్యతగా, నటుడిగా, దర్శకుడిగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, ఇప్పుడు రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు. అసలు రాజ్ తరుణ్ కు శేఖర్ బాషాకు మధ్య సంబంధం ఏమిటి అని చాలామంది చర్చించుకుంటున్నారు. నిజానికి రాజ్ తరుణ్ కు, శేఖర్ మధ్య ఏ సంబంధం లేదు. అసలు వీరిద్దరు కలిసింది నాలుగు సార్లు మాత్రమే. అయితే ఆ నాలుగు సార్లు కూడా శేఖర్ బాషా, రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ చేశారని, ఈ రకంగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పాడిందని ఇటీవలే రాజ్ తరుణ్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.  ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిన కారణంగా.. నేడు రాజ్ తరుణ్ కు మద్దతుగా శేఖర్ బాషా నిలిచాడు. అదే విధంగా లావణ్య రాజ్ తరుణ్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. పలు సాక్ష్యాలను చూపిస్తూ ఆమె వాదనాలను వ్యతిరేకించారు. మరీ, లావణ్య రాజ్ తరుణ్ వివాదంలో కొత్తగా ఎంటర్ అయిన శేఖర్ బాషా బ్యాగౌండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş