iDreamPost
iDreamPost
చెప్పా పెట్టకుండా అమెజాన్ ప్రైమ్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 వచ్చేసింది. ప్రోమోలు, సోషల్ మీడియా పోస్టులు గట్రా హడావిడి ఏమి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా స్ట్రీమింగ్ మొదలుపెట్టేశారు. అయితే ఇక్కడో ఝలక్ ఇచ్చారు. ప్రైమ్ లో అకౌంట్ ఉన్నంత మాత్రాన చూసేందుకు లేదు. 199 రూపాయలు చెల్లిస్తేనే మనకు ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మొదలుపెట్టాక రెండు రోజుల్లోపే పూర్తి చెయాలి. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల కుదరకపోతే మళ్ళీ ఇంకోసారి డబ్బులు కట్టి చూసుకోవాలి. అంటే ఒకరకంగా థియేటర్ కు మనం టికెట్ కొని చూసినట్టు ఇక్కడ పే పర్ వ్యూతో సొమ్ములు వదిలించుకోవాలన్నా మాట. పెద్ద ట్విస్టే ఇది.
ఆర్ఆర్ఆర్ కూడా ఇదే తరహాలో ఈ నెల 20న జీ5లో వస్తోంది. దాని కన్నా ముందుగా ప్లాన్ చేయడం ప్రైమ్ స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది. ఎందుకంటే జనం రెండింటికి డబ్బులు ఖర్చు పెట్టలేరు. ఏదో ఒకదానికి రెండు వందలు అంటే ఓకే అనుకునేవాళ్లు ఉంటారు. అలాంటప్పుడు ఆ అడ్వాంటేజ్ ని తామే ఎందుకు తీసుకోకూడదనేది ప్రైమ్ వేసుకున్న ప్లాన్ కావొచ్చు. నిజానికి దీనికి సంబంధించిన ఎలాంటి లీక్ బయటికి రాలేదు. మాములుగా రాత్రి 10 లేదా 12 గంటలకు స్ట్రీమింగ్ చేసే ప్రైమ్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ని మధ్యాన్నం పూట అది కూడా సోమవారం రిలీజ్ చేయడం అన్నిటి కన్నా ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇప్పటిదాకా 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన కెజిఎఫ్ 2 నార్త్ లో ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మెయిన్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా సడన్ గా ఓటిటి రూటు పట్టడం విశేషం. అయితే పైరసీలో అన్ని రకాల వెర్షన్లు అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఇలా ఇంత భారీ రేట్ ని పెట్టి టీవీలో చూడమంటే కరెక్ట్ కాదేమోననే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఫ్యామిలీతో సహా ఇంట్లోనే షో వేయాలనుకునే వాళ్లకు రెండు వందలు రీజనబుల్ అనిపించవచ్చేమో కానీ మిగిలినవాళ్లకు షాకే. ప్రైమ్ సభ్యులకు ఫ్రీ స్ట్రీమింగ్ త్వరలోనే ఉంటుంది