iDreamPost
android-app
ios-app

బాక్సాఫీస్‌ వద్ద గామి సునామీ.. రెండ్రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌?

  • Published Mar 11, 2024 | 9:52 AM Updated Updated Mar 11, 2024 | 9:52 AM

vishwak sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేను గామి సినిమాతో మంచి హిట్ టాక్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

vishwak sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేను గామి సినిమాతో మంచి హిట్ టాక్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

  • Published Mar 11, 2024 | 9:52 AMUpdated Mar 11, 2024 | 9:52 AM
బాక్సాఫీస్‌ వద్ద గామి సునామీ.. రెండ్రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌?

మాస్ కా దాస్ విశ్వక్ సేను పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మారుమోగిపోతుంది. ఎందుకంటే.. ఇండస్ట్రీలో మంచి కంటెంట్ ఉన్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. లేటెస్ట్ గా ఈయన నటించిన ‘గామి’ మూమీ విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా.. మార్చి 8న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేశారు. ఇక ఈ సినిమాను విద్యాధర్ రావు కగిత దర్శకత్వం వహించగా.. ఇందులో చాందినీ చౌదరి, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు.. కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది. అంతేకాకుండా విశ్వక్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబెట్టిన సినిమా గామి నిలిచింది.

విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా విడదుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా.. మొదటి రోజే రూ. 9.07 కోట్లు కలెక్షన్స్ ను వసూళ్లు చేసింది. అయితే సినిమాకుగాను పెట్టిన బడ్జెట్ మాత్రం రూ.24 కోట్లు గా తెలుస్తోంది. దీంతో మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మొదటిలో గామి సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా అంత స్లోగా ఉందని, కాస్త ఇల్లాజికల్‌గా ఉందని ఎక్కువగా అన్నారు. అయితే సినిమా మాత్రం టెక్నికల్‌గా ఎంతో ఆద్భుతంగా ఉందని అందరూ ప్రశంసించారు. ఈ క్రమంలోనే ఒక్కసారైనా గామిని థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే.. ఆ విజువల్స్, ఆ ఆర్ఆర్, సౌండింగ్ కోసమైనా గామిని చూడాల్సిందనని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ, కొంతమంది మాత్రం సినిమా ఏమి బాగోలేదని, డబ్బులు వేస్ట్ అని పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే సినీ ప్రేక్షకులు, విశ్వక్ అభిమానులు మాత్రం గామి సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు.

gaami rare feet 2

ఇక గామి సినిమా ఇప్పటికే నైజాం వంటి ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ కొట్టేసిందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ ఏరియాలో రెండున్నర కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ చేసిందని చెబుతున్నారు. ఇక ఓవర్సీస్‌లోనూ విశ్వక్ సేన్ రేర్ రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం 400k డాలర్లను కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇలా చూసుకుంటే.. మరో రెండు రోజుల్లో హాఫ్ మిలియన్ క్లబ్బులో జాయిన్ అయ్యేలా ఉంది. అయితే ఈ రేంజ్ లో విశ్వక్ సేన్ సినిమాలెప్పుడూ వసూళ్లు చేయలేదు.కానీ, గామి వంటి ప్రయోగాత్మక చిత్రంతో విశ్వక్ సేన్ కు ఆ ఘనత దక్కిందని చెప్పవచ్చు.కాగా, ఈ సినిమా ఇంకొంచెం లాజికల్‌గా, కాస్త వివరంగా చెప్పేలా తీసుంటే.. గామి నెక్ట్స్ లెవెల్లో ఉండేదని కొందరి అభిప్రాయం. ఇక మరి కొందరు మాత్రం కొత్త టీం కలిసి టెక్నికల్‌గా ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత క్వాలిటీతో సినిమాను ఎలా తీశారంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదేమైనా బాక్సాఫీస్‌ వద్ద గామి సునామీగా దూసుకుపోతూ రెండ్రోజుల్లో బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet