iDreamPost
android-app
ios-app

Vishwak Sen: కల్ట్ బొమ్మ vs కల్ట్.. మరో రచ్చలో విశ్వక్​సేన్!

  • Published Dec 30, 2023 | 8:01 PM Updated Updated Dec 30, 2023 | 8:01 PM

యంగ్ హీరో విశ్వక్​సేన్ ఇప్పుడు మరో రచ్చలో ఇరుక్కున్నారు. అసలు ఆ కాంట్రవర్సీ ఏంటి? అందులో ఆయన పేరు ఎందుకు వినిపిస్తుందనేది ఇప్పుడు చూద్దాం..

యంగ్ హీరో విశ్వక్​సేన్ ఇప్పుడు మరో రచ్చలో ఇరుక్కున్నారు. అసలు ఆ కాంట్రవర్సీ ఏంటి? అందులో ఆయన పేరు ఎందుకు వినిపిస్తుందనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 30, 2023 | 8:01 PMUpdated Dec 30, 2023 | 8:01 PM
Vishwak Sen: కల్ట్ బొమ్మ vs కల్ట్.. మరో రచ్చలో విశ్వక్​సేన్!

ఇండస్ట్రీలోనైనా కొత్త నీరు వస్తూ ఉండాలి. అప్పుడే విభిన్నమైన పనితీరును చూసే వీలుంటుంది. ఇందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మినహాయింపేమీ కాదు. యంగ్ టాలెంట్‌ వస్తుంటేనే డిఫరెంట్ మూవీస్ చూసే ఛాన్స్ ఉంటుంది. వాళ్లను ఆదరించడానికి ప్రేక్షకులు కూడా ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కొత్తవాళ్లు వచ్చారు. వాళ్లలో కొందరు దర్శకులైతే, మరికొందరు హీరోలు, హీరోయిన్స్. కానీ డైరెక్టర్​గా, హీరోగా సక్సెస్ కొట్టింది మాత్రం ఒక్కరే. ఆయనే విశ్వక్​సేన్. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్​నుమా దాస్’, ‘హిట్’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘దాస్​ కా ధమ్కీ’ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్​తో ఫుల్ క్రేజ్ సంపాదించారు విశ్వక్. ‘ఫలక్​నుమా దాస్​’, ‘దాస్​ కా ధమ్కీ’ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించడం విశేషం. డైరెక్షన్, యాక్టింగ్​తో పాటు స్క్రీన్ రైటింగ్ టాలెంట్ ఉన్న ఈ యంగ్ హీరో అనవసర వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

విశ్వక్​సేన్ ఇప్పుడు మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఆయన ప్రకటించిన కొత్త సినిమా టైటిలే దీనికి కారణం. ‘కల్ట్’ అనే మూవీని తాజాగా ప్రకటించారు విశ్వక్. దీనికి ఆయనే కథను అందించడంతో పాటు నిర్మిస్తున్నారు. తాజుద్దీన్ డైరెక్షన్​లో రూపొందనున్న ఈ ఫిల్మ్​లో అంతా కొత్తవాళ్లే యాక్ట్ చేస్తారని విశ్వక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ యూత్​ఫుల్ ఫిల్మ్​లో నటించాలని అనుకునేవారు తమ వివరాలను మెయిల్ ఐడీకి పంపాలని ఎక్స్​లో ఓ ట్వీట్ పెట్టారు. అయితే ‘కల్ట్’కు దగ్గరగా ఉన్న పేరుతో మరో టైటిల్ ఇప్పటికే రిజిస్టర్ అయింది. రీసెంట్ బ్లాక్​బస్టర్ ‘బేబీ’ని ప్రొడ్యూస్ చేసిన ఎస్కేఎన్ ‘కల్ట్ బొమ్మ’ పేరుతో ఆల్రెడీ టైటిల్​ను రిజిస్టర్ చేయించారు. ఇప్పుడు విశ్వక్ ‘కల్ట్’ పేరుతో మూవీని అనౌన్స్ చేయడం వివాదాస్పదంగా మారింది.

ఎస్కేఎన్ ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించుకున్న తర్వాత విశ్వక్ ‘కల్ట్’ పేరుతో ఫిల్మ్ అనౌన్స్ చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఎస్కేఎన్ నిర్మించిన ‘బేబీ’ సినిమా విషయంలోనూ విశ్వక్ వార్తల్లో నిలిచారు. ‘బేబీ’ స్టోరీని రెడీ చేసి ఓ హీరోకు వినిపించాలని అనుకున్నానని.. కానీ ఆయన వినలేదని ఆ ఫిల్మ్ డైరెక్టర్ సాయిరాజేశ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. బహుశా ఆ హీరో ప్రయారిటీ లిస్ట్​లో తాను ఉండకపోవచ్చునని చెప్పారు. అయితే ఆయన నో చెప్పిన విధానం తనకు నచ్చలేదన్నారు. ఓ హీరోనే అన్నారు గానీ అది విశ్వక్​ అని సాయి రాజేష్ బయటపెట్టలేదు. దీని తర్వాత విశ్వక్.. ‘బేబీ’ డైరెక్టర్​ను ఉద్దేశిస్తూ ఇన్​డైరెక్ట్​గా ట్వీట్ పెట్టారు. నో అంటే నో అని.. కూల్​గా ఉండాలని, అరిచి గోల చేయొద్దని అందులో రాసుకొచ్చారు. అనంతరం దీనిపై క్లారిటీ ఇచ్చారు.

‘ఎలాంటి మూవీస్ చేయాలో క్లారిటీ లేనప్పుడు ఎదుటివాళ్ల టైమ్ వేస్ట్ చేయకూడదని అనుకుంటాం. కాబట్టి కథ వినలేమని చెబుతాం. దానికి కొందరు ఫీలవుతుంటారు. అందర్నీ సంతోషపెట్టేందుకు నేనేమీ బిర్యానీ కాదు’ అని అప్పట్లో విశ్వక్​సేన్ చెప్పారు. ఈ వివాదం సద్దుమణిగినా ఇప్పుడు ‘బేబీ’ మేకర్స్​తో మరో కాంట్రవర్సీలో విశ్వక్ పేరు రావడం గమనార్హం. అయితే ఎస్కేఎన్ ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ ముందే రిజిస్టర్ చేయించారని విశ్వక్​కు తెలుసో లేదో క్లారిటీ లేదు. అయితే తెలిసో తెలియకో ఆయన మరో రచ్చలో ఇరుకున్నారు. సూపర్ టాలెంట్ ఉన్న విశ్వక్​ తరచూ వివాదాల్లో ఉంటున్నారు. మరి.. సినిమా టైటిల్ విషయంలో విశ్వక్​సేన్​ వివాదంలో ఇరుక్కోవడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Hanuman: హనుమాన్‌ ఆపాలని కుట్ర! దర్శకుడు ప్రశాంత్‌ చెప్పిన నిజాలు!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss